రాయచోటి
అన్నమయ్య జిల్లా
27/01/2025
*నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థలకు తొత్తుగా మారిన కూటమి ప్రభుత్వం*
*కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఆత్మహత్యలు జరుగుతున్న పట్టించుకోని అధికారులు*
*ఫీజుల పేరుతో విద్యార్థుల ప్రాణాలను బలి కోరుతున్న కార్పొరేట్ విద్యా సంస్థలు*
* అంబేద్కర్ విగ్రహం ముందు వామపక్ష విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో నిరసన....*
---------------------------------------------
నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థలకు తొత్తుగా మారిన కూటమి ప్రభుత్వం అని పీ.డీ.ఎస్.యూ జిల్లా అధ్యక్షుడు నేతి నాగేశ్వర, ఎస్ఎఫ్ఐ జిల్లా నరసింహులు సర్వేపల్లి అన్నారు.
సోమవారం స్థానిక రాయచోటి పట్టణంలోని మాసాపేట అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నారాయణ, శ్రీ చైతన్య కళాశాలలు విద్యార్థులపై ఫీజులు చెల్లించాలని తీవ్రమైన వేధింపులు గురిచేస్తూ, ర్యాంకుల కోసం విద్యార్థుల మధ్య తారతమ్యాలు సృష్టిస్తూ విద్యార్థుల మరణాలకు కారణమైన కార్పొరేట్ విద్యా సంస్థల యజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో పరీక్షలు దగ్గర వస్తున్న నేపథ్యంలో కార్పొరేట్ నారాయణ, చైతన్య, కళాశాలలో ఫీజులు చెల్లించాలని వేధింపులు గురిచేయడం వలన విజయవాడలో చైతన్య గోశాల క్యాంపస్, గోసలైట్,అనంతపురం నారాయణ కళాశాలలో ఫీజు చెల్లించలేదని గంటల తరబడి విద్యార్థిని తరగతి గది ముందు నిలబెట్టడంతో విద్యార్థి మనస్తాసానికి గురై అక్కడికక్కడే మూడో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా విద్యాసంస్థల తొత్తుగా మారి ఫీజులు దోపిడీకి కారణమవుతుందని అన్నారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి స్పందించకపోవడం దుర్మార్గమని అన్నారు. గతంలో ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులు చనిపోతున్నారని అన్నారు నేడు విద్యార్థులు చనిపోతున్న ఎందుకు మాట్లాడటం లేదు అని ప్రశ్నించారు. అదేవిధంగా ఆత్మహత్యలపై గతంలో టిడిపి ప్రభుత్వం ప్రొఫెసర్ నీరద రెడ్డి కమిషన్ వేసింది. కానీ సిఫారసులను అమలు చేయడంలో విఫలం చెందిందని అన్నారు. ఇంటర్మీడియట్ విద్యా మండలి కమిషనర్ స్పందించి నారాయణ చైతన్య విద్యాసంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, ఘటనలకు కారణమైన విద్యాసంస్థలను సీజ్ చేయాలని, యజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మరణించిన విద్యార్థులకు న్యాయం చేయాలని అన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులు ఒత్తిడి లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిస్తామని హెచ్చరిస్తున్నాం.
ఈ కార్యక్రమంలో పిడిఎస్ యూ జిల్లా సహాయ కార్యదర్శి అశోక్ ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గురునాథ్, పవన్ నాయక్ మరియు సంఘాల నాయకులు పాల్గొన్నారు