మీడియా "నిజాలు-అబద్దాలుగా .., అబద్దాలు-నిజాలుగా".....మారుస్తోంది...!?*


 *కుంటి గుర్రాలపై గుడ్డి జర్నలిజం*


 *రేస్ లో కొందరు జర్నలిస్టులు.*


*మీడియా ప్రశ్నించేతత్వం మరిచింది...!*


*మీడియా "నిజాలు-అబద్దాలుగా .., అబద్దాలు-నిజాలుగా".....మారుస్తోంది...!?*   


           జర్నలిజం అంటే సమాజాన్ని సంస్కరించు కోవడం కోసం ప్రతీ చెడును ప్రశ్నించడం అని మనందరికీ తెలిసిన విషయమే.ప్రతీ చెడుకి కారణమైన విషయాలను తెలుసుకోవాలంటే,ఎవరికైనా ప్రశ్నించేతత్వం ఉండి తీరాలి.ఈ తత్వం అందరి లో ఉందా....?అంటే....ఈ ప్రశ్నించేతత్వం చాలా తక్కువమందిలో మాత్రమే ఉంటుంది.ఇకపోతే ప్రశ్నించేతత్వానికి పర్యాయపదంగా ఉన్న జర్నలిజం "ప్రశ్న", 'ప్రశ్నించు' అనే విధానాన్ని తమలో ఇముడ్చుకుని ఉంది.సమాజంలో జరుగుతున్న ప్రతీ చెడును ప్రశ్నించి సమాధానం రాబట్టి "నిజం" ఈ సమాజానికి, ప్రభుత్వానికి బట్టబయలు చేయడమే జర్నలిజం ముఖ్యమైన పని అని తెలుసుకోవాలి. ఈ సమాజంలో ఎంతోమంది ప్రజలు,ఎన్నో వ్యవస్థలు, బలహీన వర్గాలు,పీడిత- బాధిత వర్గాల ప్రజలు  న్యాయంకోసం గొంతెత్తి ప్రశ్నించలేని పరిస్థితులు ఏనాటినుండో ఉన్నాయి. ఇటువంటివారి వాయిస్ వినిపించేందుకు,చూయించేందుకు వారి పక్షాన ఉండాల్సిన మీడియా ఇప్పుడు ఉందా...?అంటే అమ్మ నా బూతులు తిట్టేవారు అనుకున్న దానికంటే ఎక్కువగా తిడుతున్నవారు ఉన్నారు అని మనం గ్రహించాలి.


       అవును జర్నలిజం  అంటే నిజం.ఆ నిజాన్ని ఎవరినుండైనా రాబట్టాలి అంటే,ప్రశ్న అనేది ప్రధాన అస్త్రం.ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రశ్నించే హాక్కు ప్రతివ్యక్తికి ఉంది.కానీ ఎవరూ ప్రశ్నించే సాహసం చేయడంలేదు.యస్,సరిగ్గా ఇక్కడే మనకు ఇదే ప్రజాస్వామ్యానికి నాలుగవ స్తంభంగా ఉన్న మీడియా రంగం ఒకటి మనకు ఉంది.ప్రస్తుతం ఉంది అని చెప్పుకుంటున్న ఈ మీడియా రంగం కొన్నేళ్లుగా చెడును, అన్యాయాలను,అవినీతి-అక్రమాలు,దోపిడీ-దొంగాటలను ప్రశ్నించడం మరిచిపోగా....జర్నలిస్టుల నోట ప్రశ్న బయటకు రాలేక ప్రాణం తీసుకుంది. అవును కొందరు జర్నలిస్టులు ప్రశ్నించడం మరిచిపోయారు. కొత్తగా వచ్చిన జర్నలిస్టులయితే తనకు తెలిసిన సమాచారం తప్ప,ఎక్కడ...ఏమి జరుగుతోంది అని తెలుసుకునే ప్రయత్నమే లేదు.పేరుకు మాత్రం జర్నలిస్టులు.వీరివల్లనే మీడియాలో పరిశోధనాత్మక జర్నలిజం పీకల్లోతు కూరుకుపోయింది.ఇక  కొందరు జర్నలిస్టుల ద్వారా జర్నలిజంలో ప్రశ్నించేతత్వం తన స్వరూపాన్ని కోల్పోయింది. ప్రశ్నించి నిజం చెప్పాల్సిన కొందరి జర్నలిస్టుల కలాలు విషం చిమ్ముతున్నాయి. మీడియాలో నిఘా నేత్రాలు కళ్ళు మూసుకుపోతే దేశసంపద అంతర్జాతీయ స్థాయిలో సముద్ర మార్గాన అడ్డంగా తరలిపోతుంది.అలాగే అడవిబిడ్డలకు జీవనాధారమైన విలువైన ఆటవీసంపద జాతీయ స్థాయిలో రాష్ట్రాలు దాటి వెళుతుంటే గొంతెత్తి ప్రశ్నించాల్సిన గొంతుకలు ఎక్కడ...?ఓ...అవి ఎప్పుడో ప్రాణం తీసుకున్నాయి కదా...!మరి మీడియా నిఘా నేత్రాలు ఎక్కడ...?పాలకుల కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి ఉన్నది లేనట్లు,లేనిది ఉన్నట్లు కట్టుకథలు రాసే పెట్టుబడుల కలాల ద్వారా విషం పరుచుకునే విషపుత్రికలు ఎక్కడ...?ఓ...ఆత్మ వంచన చేసుకున్నాయి కదూ...?ఆచ్చు కాబడిన అక్షరం ప్రజల్లో ఒక నమ్మకాన్ని గూడు కట్టుకునేలా చేస్తుంది కదా...అని, ఎవడైనా సరే దానిని నమ్మి తీరాల్సిందేనని, కొన్ని పత్రికలు/ఛానల్స్ అక్షరాలను ఆత్మవంచన చేసుకుని కధనాలు సృష్టిస్తుంటే అమాయకపు ప్రజలు వాటిని నమ్మేస్తున్నారు.కొన్ని మీడియా ఛానల్స్ తాము చెప్పిందే 'నిజం' అనేలా ప్రజల్ని గుడ్డివాళ్ళను చేసింది గాక,వాళ్ళను కుంటి గుర్రాలపై ఎక్కించి మరీ కుంటి-గుడ్డి గుర్రాల రేసు నిర్వహించింది అని ప్రజలు అర్ధం చేసుకోవాలి.


        జర్నలిజం గొంతుకలు నిజం పలకలేక మూగబోతున్నాయి.జర్నలిజం కొంతకాలంగా అవినీతి -అక్రమాలను ప్రశ్నించడం మరిచిపోయింది. మీడియా చేతిలో ఉన్న కెమెరాలు వాస్తవాలు చూపడంలేదు.కొన్ని మీడియా మైకులు నరంలేని నాలుకల వాయిస్లను మాత్రమే మనకు వినిపిస్తున్నాయి. అందుకే నిజం చెప్పలేని జర్నలిజం ఎప్పుడో.... చచ్చిపోయింది. విలువలతో పనిచేస్తున్న జర్నలిస్టులు కూడా రోడ్డునపడ్డారు.నిజం చెప్పలేని జర్నలిజం మనకొద్దు.పైసలిచ్చే ప్రతివాడి పెట్టుబడికి- కట్టుకధలు రాసేది జర్నలిజం కాదని తెలుసుకోండి.అటువంటిది ఏమైనా ఉంటే అది జర్నలిజం కాదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. నిజం పలికే జర్నలిజం మళ్ళి బ్రతకాలి.నిజం నిజంలానే మనముందుకు రావాలి.సమాజం మంచి- చెడు రెండూ చూస్తుంది. కానీ మంచిని ప్రోత్సహిస్తే తప్ప చనిపోయింది అనుకున్న జర్నలిజం బ్రతకదు.ఇంకా కొందరు జర్నలిస్టులు "నిజాలను -నిజాలుగా...అబద్దాలను అబద్దాలుగా" రాసి జర్నలిజంలో నిజాన్ని, జర్నలిజాన్ని బ్రతికించాలి. లేని పక్షంలో ఈ ప్రక్షాళన ప్రజలే చేయాలి.అప్పుడే మనం కోరుకుంటున్న జర్నలిజం బ్రతికి ఉంటుంది