పండిట్ నెహ్రూ బస్టాండ్ లోజరిగిన దొంగతనం కేసులో నిందితుల అరెస్ట్*

*ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ.*

*పండిట్ నెహ్రూ బస్టాండ్ లోజరిగిన దొంగతనం కేసులో నిందితుల అరెస్ట్*



*వారి వద్ద నుండి Rs.45 వేల రూపాయలు విలువైన రెండు బట్టల బెల్స్ స్వాధీనం.*


విజయవాడ కృష్ణలంక ఏరియాకు చెందిన ఫిర్యాది గత ఎనిమిది సంవత్సరాలుగా ఆటోనగర్ బస్ టెర్మినల్ నందు డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు, ప్రతి రోజూలాగా ది.19.12.2024 తేదిన ఆటో నగర్ నుండి హైదరాబాదు వెళ్ళడానికి బయలుదేరి విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లోనికి వచ్చి ఆర్.టి.సి.కార్గో పార్సిల్ కౌంటర్ లో హైదరాబాదు కు తీసుకువెళ్లాల్సిన స్టాక్ వేసుకుని పాసింజర్ లను ఎక్కించుకుని హైదరాబాద్ వెళుతున్న సమయంలో బస్ స్టాండ్ బయట కొందరు బస్ ఆపి ఎక్కినట్లు ఆ సమయంలో వారి లగేజ్ వెనుక డిక్కీలో పెడుతున్న సమయంలో పార్సిల్ కౌంటర్ నందు వేసుకున్న స్టాక్ లోని రెండు బట్టల బెల్స్ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్లు తెలుసుకుని వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చి అనంతరం హైదరాబాద్ వెళ్లి తిరిగి విజయవాడ వచ్చినట్లు అనంతరం ది.23.12.2024 తేదిన కృష్ణ లంక పోలీస్ స్టేషన్ నందు ఇచ్చిన ఫిర్యాదుపై కృష్ణ లంక పోలీస్ వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది.


ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించి త్వరితగతిన చేదించి నిందితులను అరెస్ట్ చేయాలని నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి రాజశేఖర్ బాబు ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు, డీసీపీ క్రైమ్స్ శ్రీ కే.తిరుమలేశ్వర రెడ్డి ఐపిఎస్, గారి సూచనలతో, క్రైమ్ ఏ.డి.సి.పి. శ్రీ ఎం. రాజా రావు గారి  పర్య వేక్షణలో, క్రైమ్ ఏ.సి.పి. శ్రీ Ch.వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో లో, సి.సి.ఎస్. ఇన్స్పెక్టర్ అబ్దుల్ సలాం గారు, కృష్ణలంక ఇన్స్పెక్టర్ శ్రీ ఎస్.వి.వి.నాగరాజు గార్లు వారి  వారి సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సంఘటనా స్థలంలో సేకరించిన ఆధారాలను మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిచుకుని అనుమానితులు మరియు పాత నేరస్తుల కదలికలపై గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. 


ఈ నేపథ్యంలో దర్యాప్తు బృందాలకు రాబడిన సమాచారం మేరకు నిన్న ది.06.01.2025 తేదిన సాయంత్రం సమయంలో పండిట్ నెహ్రూ బస్టాండ్ ఎరైవల్ బ్లాక్ వద్ద  నలుగురు వ్యక్తులను అదుపులోనికి తీసుకుని విచారించి వారి వద్దనుండి చోరీ సొత్తు స్వాదీనం చేసుకుని అరెస్ట్ చేయడం జరిగింది.

*నిందితుల వివరాలు:*

1. తెలంగాణా, మేహబూబాద్ జిల్లా, నరసింహుల పేట ఏరియాకు చెందిన బుక్యా బాలు (35 సం.)

2. తెలంగాణా, మేహబూబాద్ జిల్లా, నరసింహుల పేట ఏరియాకు చెందిన బుక్యా హరికృష్ణ  (22 సం.)

3. తెలంగాణా, మేహబూబాద్ జిల్లా, నరసింహుల పేట ఏరియాకు చెందిన గుగులోతు కళ్యాణ్ (20 సం.)

4. తెలంగాణా, మేహబూబాద్ జిల్లా, నరసింహుల పేట ఏరియాకు చెందిన బుక్యా రమేష్ (35 సం.)



వివరాల్లోకెళ్తే..... నిందితులు అందరూ తెలంగాణా రాష్ట్రం, మేహబూబాద్ జిల్లా, నరసింహుల పేట, పకీరా తండా గ్రామానికి చెందిన వారు వీరు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవించేవారు. ఈ క్రమంలో జల్సాలకు అలవాటు పడి, వారి జల్సాలకు సులభంగా డబ్బు సంపాదించి జల్సాలు చేయాలని నిర్ణయించుకున్నారు.అనుకున్నదే తడవుగా ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతాలలో మనుషులను ఏమార్చి వారి వస్తువులను దొంగిలించాలని అనుకున్నారు. ఎక్కువ రద్దీగా ఉండే ప్రదేశాలైన బస్ స్టాండ్ లను ఎంచుకుని బస్సులలో వెనుక డిక్కీ లలో వేసిన వస్తువులను డ్రైవర్ లకు కండక్టర్ లకు తెలియకుండా దొంగతనం చేస్తారు. 


వీరిలో బుక్యా బాలు మరియు బుక్యా రమేష్ లపై నరసింహుల పేట పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ సస్పెక్ట్ షీట్స్ కలవు. వీరు గతంలో పలు దొంగతనాల కేసులలో అరెస్ట్ కాబడి జైలుకు వెళ్లి వచ్చినారు. అనంతరం కూడా వారు దొంగతనాలు మనకుండా చేస్తున్నారు. వీరితోపాటు వీరి దగ్గరి బంధువులైన మరో ఇద్దరినీ బుక్యా హరికృష్ణ మరియు గుగులోతు కళ్యాణ్ లను చేర్చుకుని దొంగాతనాలు చేయడం జరుగుతుంది. వీరిపై ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలోని గుంటూరు,  ఖమ్మం, నేలకొండపల్లి, కూసుమంచి, మహబూబాబాద్, హనుమకొండ, కాన్పూర్, కేంప్లల్లి, బద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, మర్రిపెడ పోలీస్ స్టేషన్ల పరిదిలో పలు దొంగతనం కేసులు కలవు. 


ఈ క్రమంలో ది.19.12.2024 తేదీన కూడా ఏదైనా కొత్త ప్రదేశంలో దొంగతనం చేద్దామని విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ కు వచ్చి రెక్కీ నిర్వహిస్తున్న సమయంలో హైదరాబాద్ వెళ్ళే బస్ లో బట్టల బెల్స్ వేయడాన్ని గమనించారు. వెంటనే వాటిని దొంగతనం చేయాలని నిర్ణయించుకుని దాని వెనకాలే వెళ్లి డ్రైవర్ బస్సులోకి ప్రయానికులను ఎక్కించుకునే సమయంలో ఒకడు బస్సు క్లీనర్ లాగాఅక్కడే తిరుగుతూ డిక్కీలో ఉన్న రెండు బెల్స్ లను దొంగిలించి తీసుకు వెళ్ళిపోయారు. పద్మావతి ఘాట్ సమీపంలో వాటిని దాచిపెట్టి అక్కడ నుండి రైల్వే స్టేషన్ కు వెళ్లి ట్రైన్ ఎక్కి వారి ఊరు వెళ్ళిపోయారు. 


ఈ క్రమంలో ది.06.01.2025 తేదిన వారు దాచి పెట్టిన వాటిని తీసుకుని టూరిస్ట్ ప్రదేశం అయిన విజయవాడ శనీశ్వర స్వామీ టెంపుల్ పరిసర ప్రాంతాలలో అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి అనుకుని వచ్చిన  సమయంలో కృష్ణ లంక మరియు సి.సి.ఎస్.వారి ప్రత్యేక బృందాలకు రాబడిన సమాచారం మేరకు అదుపులోనికి తీసుకుని విచారించి వారి వద్ద నుండి చోరీ సొత్తు స్వాదీనం చేసుకుని అరెస్ట్ చేయడం జరిగింది.     

    

ఈ కేసును అతి తక్కువ సమయంలో చేదించడంలో కీలకంగా వ్యవహరించిన సి.సి.ఎస్. ఇన్స్పెక్టర్ అబ్దుల్ సలాం గారు, కృష్ణలంక ఇన్స్పెక్టర్ శ్రీ ఎస్.వి.వి.నాగరాజుగార్లను మరియు వారి సిబ్బందిని నగర్ పోలీస్ కమిషనర్ గారు అభినందించారు

***