ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర ఆర్టిఐ విభాగం అడ్వైజర్ గా తిప్పన బోయిన. మల్లికార్జున

 ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర ఆర్టిఐ విభాగం అడ్వైజర్ గా తిప్పన బోయిన.  మల్లికార్జున 

 మార్కాపురం జనవరి 5. ప్రజా సంకల్ప వేదిక గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో కార్యక్రమం  పరిధిలో ఆర్టిఐ విభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టిఐ అడ్వైజర్ గా మార్కాపురం టౌన్ లోని శివాజీ నగర్ నాలుగో లైన్ లో నివసిస్తున్న తిప్పన బోయిన మల్లికార్జున ను నియమించినట్లు ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర అధ్యక్షులు మదిరే రంగ సాయి రెడ్డి అడ్వకేట్  ప్రకటించారు సోమవారం మదిరే  రంగసాయి రెడ్డి మీడియాకు విడుదల చేసిన ఒక లేఖలో రాష్ట్ర కమిటీ లో పలు కీలక పదవులు ప్రచురించారు ఇందులో భాగం గా రాష్ట్ర ఆర్టిఐ విభాగం లో రాష్ట్ర ఆర్టిఐ అడ్వైజర్ గా ప్రకటించారు 





ఈ క్రమంలో తిప్పన బోయిన మల్లికార్జున ను  నియమించినట్లు తెలిపినారు రాష్ట్ర పరిధిలో జరుగుతున్న అవినీతి కార్యకలాపాలపై మరియు అవినీతికి పాల్పడుతున్న అధికారులపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తామన్నారు రాష్ట్ర ఆర్టిఐ అడ్వైజర్ గా నియమితులైన తిప్పన బోయిన మల్లికార్జున  మాట్లాడుతూ ఇంతటి బాధ్యతను తనపై నమ్మకముతో అప్పగించి రాష్ట్ర అధ్యక్షులు మదిరే రంగ సాయి రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర పరిధిలో అవినీతిని నిర్మూలించేందుకు శాయశక్తుల కృషి చేస్తానని పేర్కొన్నారు 

 తన నియామకానికి సహకరించిన ప్రతి ప్రజా సంకల్ప వేదిక సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు