విజయవాడ..
ఎపిఈఆర్సీ నిర్వహిస్తున్న ప్రజాప్రాయ సేకరణలో విద్యుత్ చార్జీలు పెంపుదలకు వ్యతిరేకంగా వైఎస్సాఆర్ సిపి తరపున ఎపిఈఆర్సి చైర్మన్ ని కలసి వినతిపత్రం ఇచ్చిన వైసిపి నేతలు దేవినేని అవినాష్, మల్లాది విష్ణు.
*మల్లాది విష్ణు.. మాజీ ఎమ్మెల్యే..*
రాష్ట్రం అభివృద్ది చెందాలి అంటే విద్యుత్ శక్తి చార్జీలు ప్రజలపై పడకూడదు..
చంద్రబాబు ఎన్నికల ముందు తమకు ఓటు వేస్తే విద్యుత్ చార్జీలు పెంచమని పదే పదే ప్రకటించారు..
15485వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై భారం మోపడానికి సిద్దం అయ్యింది..
ఈ బహిరంగ విచారణ అంతా తూతూ మత్రమే..
ఎపిఈఆర్సి చైర్మన్ ని కలసి వినతిపత్రం ఇచ్చాం..
15వేలకోట్లు ప్రజలపై భారం మోపోద్దు.. ప్రభుత్వానికి విన్నవించమని చెప్పాం..
ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన మాటకి, , చంద్రబాబు మాట్లాడిన మాటకి పుర్తి భిన్నం..
గత నెల విద్యుత్ చార్జీల పెంపుపై ఆందోళన నిర్వహించాం..
బహిరంగ విచారణలో కూడా ప్రజల సమస్యలను వైసిపిగా విన్నవించాం..
ఇప్పటికే చార్జీల భారం ప్రజలపై పడింది.. వచ్చే నెల నుండి పెంచే పెంపుదలను విరమించుకోవాలని కోరాం..
చంద్రబాబు ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన విద్యుత్ సంస్ధల బకాయిలు 40వేల కోట్లు వైసిపి అధికారంలోకి వచ్చాకా ఇచ్చాం..
చంద్రబాబు పులివెందులలో, కర్నూల్, విశాఖపట్నం వివిధ వేదికలపై మాట్లాడిన మాటలను ప్రజలకు గుర్తు చేస్తున్నాం..
*దేవినేని అవినాష్.. ఎన్టీఆర్ జిల్లా వైసిపి, అధ్యక్షులు..*
విజయవాడ A-కన్వెన్షన్ నందు విద్యుత్ నియంత్రణ మండలి(APERC) నిర్వహించిన "బహిరంగ ప్రజాభిప్రాయం సేకరణ" కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని APERC చైర్మన్ ఠాకూర్ రామ సింగ్ ,మెంబెర్ పి.వెంకట రామ రెడ్డి వినతి పత్రం అందజేసాం..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని వైసిపి తరపున వినతిపత్రం ఇచ్చాం..
పేద ప్రజల నడ్డి విరేచి విధంగా కూటమి ప్రభుత్వ ముందుకు వెళ్తుంది..
175 నియోజకవర్గాల్లో విద్యుత్ చార్జీలు తగ్గించాలని వైసీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేశాం.
ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా నడుచుకుంటున్న కూటమి ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా ప్రజలతో కలిసి పోరాటం చేస్తాం..