నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలో వైసీపీ యువనేత మణితేజ అనుమానాస్పద మృతి

 ఎన్టీఆర్ జిల్లా -------

నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలో వైసీపీ యువనేత మణితేజ అనుమానాస్పద మృతి 






మణితేజ మృతి విషయం తెలుసుకుని నందిగామ మార్చురీకి చేరుకున్న వైసీపీ నాయకులు 

మణితేజ మృతదేహాన్ని పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ , మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు ,జగ్గయ్యపేట నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరరారావు, రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి చిన్న మరియు వైసీపీ శ్రేణులు..

*దేవినేని అవినాష్,ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు*

మణితేజది ముమ్మాటికీ రాజకీయ హత్యే మణితేజ మృతి పై  మాకు అనేక అనుమానాలున్నాయి మణితేజ కుటుంబం వైసీపీలో క్రియాశీలకంగా ఉంటోంది మణితేజ కుటుంబం వైసీపీలో యాక్టివ్ గా ఉండటం టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు 


ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో టీడీపీ చిచ్చు పెడుతోంది కోడిపందాల బరిలో జరిగిన గొడవలను అడ్డుపెట్టుకుని మణితేజను పొట్టనపెట్టుకున్నారు  మణితేజ హత్యను టీడీపీ , పోలీసులు ప్రమాదంగా చిత్రీకరించేయత్నం చేస్తున్నారు 

 

మణితేజ మృతదేహానికి ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టుమార్టమ్ చేయించాలి ఈ ఘటనకు కారణమైన వారిని గుర్తించి ...వారి పై మర్డర్ కేసు నమోదు చేయాలి మణితేజ కుటుంబానికి వైసీపీ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది 


మణితేజ మృతి పై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీసులది , ప్రభుత్వానిదే ఈ ప్రభుత్వానికి ఇంకా మిగిలింది మూడు సంక్రాంతులే జగన్ మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారు 


తప్పుచేసిన వారికి చట్టపరంగా కచ్చితంగా శిక్ష పడేలా చేస్తాం మణితేజ కుటుంబానికి చంద్రబాబు , పవన్ ,లోకేష్ సమాధానం చెప్పాలి 


రెడ్ బుక్ ఇంకా తెరిచే ఉంది ముగిసిపోలేదని లోకేష్ అంటున్నాడు 

మనుషుల ప్రాణాలు తీయడమేనా రెడ్ బుక్ అంటే  *మొండితోక జగన్మోహన్ రావు , మాజీ ఎమ్మెల్యే ,నందిగామ* మణితేజ మృతి యాక్సిడెంట్ గా చిత్రీకరించారు 


తల పై బలంగా కొట్టినట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది మణితేజ మృతి పై మాకు అనేక అనుమానాలున్నాయి జగన్ మోహన్ రెడ్డి బర్తడే చేసినందుకు మణితేజను పోలీసులు చాలా ఇబ్బంది పెట్టారు


ఇప్పుడు కోడిపందాల వద్ద గొడవ తర్వాత మణితేజ చనిపోయాడు మణితేజ మృతిని హత్య కోణంలోనే దర్యాప్తు చేయాలి  


*తన్నీరు నాగేశ్వరావు, జగ్గయ్యపేట నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి*మణితేజది ముమ్మాటికీ హత్యే మణితేజ మృతిని హత్య కేసుగానే నమోదు చేయాలి 


జగ్గయ్యపేట , నందిగామ నియోజకవర్గాల్లో ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారు జై జగన్ అంటే కేసులు పెడుతున్నారు 


వైసీపీ ఫ్లెక్సీలను చించి తిరిగి వైసీపీ కార్యకర్తల పై కేసు నమోదు చేస్తున్నారునందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు 

పోలీసులను వాడుకుంటూ వైసీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు