ప్ర‌జా ఆరోగ్యానికే పెద్ద‌పీట‌... ఇక‌పై ఇర‌వై రోజుల‌కొక ఉచిత మెడిక‌ల్ క్యాంప్ : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

 న్యూస్ నైన్ విజయవాడ 05-01-2025


*ప్ర‌జా ఆరోగ్యానికే పెద్ద‌పీట‌... ఇక‌పై ఇర‌వై రోజుల‌కొక  ఉచిత మెడిక‌ల్ క్యాంప్ : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)*













 ఉచిత మెగా మెడిక‌ల్ క్యాంప్ ఏర్పాటు చేసిన కేశినేని ఫౌండేష‌న్ 

మెడిక‌ల్ క్యాంప్ ను ప్రారంభించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ ,ఎమ్మెల్యే సుజనా చౌద‌రి

 వైద్య ప‌రీక్ష‌లకు భారీ సంఖ్య‌లో హాజ‌రైన ప్ర‌జ‌లు

సీఎం సూచ‌న‌ల‌పై న‌గ‌రాభివృద్ధి పై ప్ర‌త్యేక దృష్టి

రాబోయే బ‌డ్జెట్ స‌మావేశాల్లో న‌గ‌రాభివృద్దికి నిధుల కేటాయింపు 

హీల్ స్వ‌చ్ఛంద‌ సంస్థ‌తో క‌లిసి ఉచితంగా కృతిమ అవ‌య‌వాలు ఇచ్చే ఏర్పాటు 

న‌గ‌రాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా చేయ‌ట‌మే ల‌క్ష్యం


విజ‌య‌వాడ :  ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో పేద,  మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఎక్కువ‌గా వున్నారు. ప్ర‌జ‌ల చాలామంది   చిన్న చిన్న ఆరోగ్య స‌మ‌స్య‌ల ప‌ట్ల‌ నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నారు. ఈ నిర్ల‌క్ష్యం చేయ‌టం వ‌ల్ల ప్ర‌జ‌లు ఆరోగ్య‌ప‌రంగా ప‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే  ప్ర‌జ‌ల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని, వారి ఆరోగ్యాన్ని మెరుగుప‌ర్చేందుకు ప్ర‌తి ఇర‌వై రోజుల‌కొక‌సారి ఉచిత మెడిక‌ల్ క్యాంప్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ తెలిపారు.  ప్ర‌జ‌ల ఆరోగ్య ప్ర‌మాణాల‌తో పాటు జీవ‌న ప్ర‌మాణాలు కూడా పెంచే దిశ‌గా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్ర‌జా ఆరోగ్యానికే పెద్ద‌పీట వేస్తామ‌న్నారు. 


కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్తపేట లోని కె బిఎన్ కళాశాల ఆవరణలో ఆదివారం ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ  మెడిక‌ల్ క్యాంప్ ను  ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్య అతిథులుగా పాల్గొని  ప్రారంభించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్ర‌హానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంత‌రం మెడిక‌ల్ క్యాంప్ లో ఏర్పాటు చేసిన ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్,  గైనకాలజిస్ట్ , , వెరికోస్ వెయిన్స్ విభాగాల్లో ప్ర‌జ‌ల‌కు అందుతున్న వైద్య సేవ‌ల‌ను అడిగితెలుసుకున్నారు. అలాగే బాధితుల‌కు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 


ఈ ఫ్రీ మెడిక‌ల్ క్యాంపుకి  వైద్య ప‌రీక్ష‌ల కోసం మొత్తంగా   3 వేల మందికి పైగా ప్రజలు  హాజ‌ర‌య్యారు. జ‌న‌ర‌ల్ మెడిసిన్ విభాగంలో పరీక్ష‌లు కోసం  500 మంది, కంటి ప‌రీక్ష‌లు  750 మంది, వెరికోస్ వెయిన్స్ స‌మ‌స్య‌తో 1250 మంది, ఆర్థోపెడిక్స్  250విభాగంలో  మంది , గైనకాల‌జిస్ట్ విభాగానికి  350 మంది ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. 


ఈ సంద‌ర్భంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ   ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో   వెరికోస్ వెయిన్స్ అనే స‌మ‌స్య‌తో ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఇబ్బంది ప‌డుతున్నారని,  ఈ స‌మ‌స్య నుంచి ప్ర‌జ‌ల‌కు కాపాడేందుకే  ఈ ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. గ‌తంలో ప్ర‌తి డివిజ‌న్ లో  ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి మెడిక‌ల్ క్యాంప్ లు  నిర్వ‌హించారని కొనియాడారు. కేశినేని ఫౌండేష‌న్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ ఫ్రీ మెడిక‌ల్ క్యాంప్ లో వెరికోస్ వెయిన్స్ బాధితుల‌కి ఉచితంగా మందులు ఇవ్వ‌ట‌మే కాకుండా. అవ‌సర‌మైన వారికీ ఆప‌రేష‌న్స్ కూడా ఉచితంగా చేయించ‌నున్న‌ట్లు చెప్పారు. అలాగే హీల్ అనే  స్వ‌చ్ఛంధ‌ సంస్థ‌తో క‌లిసి రోడ్డు ప్ర‌మాదాల్లో కాళ్లు చేతులు కోల్పోయిన వారికి కృతిమ అవ‌య‌వాలు ఉచితంగా అందించే ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌జ‌ల  ఆరోగ్య‌మే ప్ర‌థ‌మ క‌ర్త‌వ్యం గా ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం ప‌నిచేస్తున్న‌ట్లు తెలిపారు. 


న‌గ‌రాభివృద్ధి పై దృష్టి 

ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి తో క‌లిసి  నిరంత‌రం తాము న‌గ‌ర అభివృద్ది పైనే దృష్టి సారించిన‌ట్లు తెలిపారు. 

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సెంట్ర‌ల్, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్ది పై ప్ర‌త్యేక దృష్టి పెట్టి ప్రణాళిక సిద్దం చేయాల‌ని సూచించార‌ని తెలిపారు.కొండ ప్రాంతమైన ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో  తాగు నీటి స‌మ‌స్య‌, స్ట్రామ్ వాట‌ర్, డ్రైనేజీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కోసం కృషి చేయ‌నున్న‌ట్లు తెలిపారు. రాబోయే  బ‌డ్జెట్ స‌మావేశాల్లో విజ‌య‌వాడ న‌గరం మొత్తానికి  కావాల్సిన మౌలిక వ‌స‌తుల‌కి సంబంధించిన నిధులు కేటాయింపు జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలిపారు. 


అలాగే న‌గ‌రంలోని రోడ్ల తో పాటు ఇత‌ర  మౌలిక వ‌స‌తులు మెరుగుప‌ర్చ‌టానికి క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ,మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ధ్యాన‌చంద్ర‌తో క‌లిసి ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం ప్ర‌తి రోడ్డు సంద‌ర్శిస్తున్న‌ట్లు తెలిపారు. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలోని ట్రాఫిక్ స‌మ‌స్య‌ను తగ్గించేందుకు కూడా ఆలోచ‌న‌లు చేస్తున్న‌ట్లు చెప్పారు. విజ‌య‌వాడ సిటీ ను  గ్రీన్ సిటిగా మార్చటంతో పాటు, న‌గ‌రాన్ని మ‌రింత‌ అందంగా త‌యారు చేసేందుకు అవ‌స‌ర‌మైన చోట్ల రోడ్ల వెడ‌ల్పు చేయ‌టం, జంక్ష‌న్ ప్రాంతాల్లో సర్కిల్స్ నిర్మించి ఫౌంటెన్స్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు  తెలిపారు. విజ‌య‌వాడ  న‌గ‌రాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా త‌యారు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 



కార్యక్రమానికి సహకరించిన ఎన్టీఆర్ ట్రస్ట్, గో హాస్పిటల్స్, శంక‌ర్ ఐ హాస్ప‌ట‌ల్,  కెబిఎన్ క‌ళాశాల‌  యాజ‌మాన్యానికి  ఎంపి కేశినేని శివ‌నాథ్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. 


అనంత‌రం ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే సంకల్పంతో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. నిరుపేద రోగులకు వైద్య ఖర్చుల భారం పడకుండా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని  ఉచితంగా అందజేస్తున్న ఎంపీ కేశినేని శివనాథ్ ను గో వ్యాస్కులర్ హాస్పిటల్ వారిని అభినందించారు. అన్ని ప్రాంతాల్లో ఉచిత మెగా మెడికల్  క్యాంపులను ఏర్పాటు చేయాలని ఎంపీ కేసినేని శివనాథ్ ను ఎమ్మెల్యే సుజనా కోరారు.



ఈ కార్య‌క్ర‌మంలో  టిడిపి రాష్ట్ర అధికార ప్ర‌తినిధి కె.నాగుల్ మీరా, టిడిపి రాష్ట్ర కార్య‌నిర్వ‌హ‌క కార్య‌ద‌ర్శి ఎమ్.ఎస్.బేగ్, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్య‌ద‌ర్శి మహ మ్మద్ ఫ‌తావుల్లా, ఎపి బిల్డింగ్ అద‌ర్ క‌న్సస్ట్ర‌క్ష‌న్ అడ్వైజ‌రి క‌మిటీ చైర్మ‌న్ గొట్టుముక్క‌ల ర‌ఘురామ‌రాజు, టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు ప‌ర్చూరి ప్రసాద్, టిడిపి రాష్ట్ర తెలుగు మ‌హిళా ఉపాధ్య‌క్షురాలు షేక్ ఆశ, తెలుగు యువ‌త అధ్యక్షులు కాండ్రేగుల ర‌వీంద్ర‌, టి.ఎన్.ఎస్.ఎఫ్ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పి.చ‌ర‌ణ్ సాయి యాద‌వ్, జిల్లా వాణిజ్య విభాగ  నాయకులు సోలంకి రాజు, 52వ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఉమ్మడి చంటి, 54వ డివిజ‌న్ కార్పొరేట‌ర్ హ‌ర్ష‌ద్, టిడిపి నాయ‌కులు మైల‌వ‌ర‌పు దుర్గారావు, మైల‌వ‌ర‌పు కృష్ణ‌, డివిజ‌న్ అధ్యక్షులు కొప్పుల గంగాధ‌ర‌రెడ్డి, కుంచం దుర్గారావు, బ‌డుగు వెంక‌న్న‌, జాహీద్ ,తాజుద్దీన్, అన్సార్, పేరాబ‌త్తుల ర‌మ‌ణ‌, డి.ప్ర‌భుదాసు లతో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.