*గణతంత్ర దినోత్సవం సందర్భంగా పూర్తి ట్రయిల్ రన్ పరిశీలించిన అధికారులు* రేపు ది.26.01.2025 తేదిన ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగబోవు గణతంత్ర దినోత్సవ వేడుకల పురస్కరించుకొని ఈ రోజు ది.24.01.2025 తేదిన *ప్రభుత్వ కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా ఐ.ఎ.ఎస్.గారు,
రాష్ట్ర డి.జి.పి. శ్రీ సి.హెచ్.ద్వారకాతిరుమల రావు ఐ.పి.ఎస్.గారు, పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు జిల్లా కలెక్టర్ శ్రీ జి.లక్ష్మిశా ఐ.ఎ.ఎస్.గార్లు ఇతర శాఖల అధికారులతో కలిసి స్టేడియంలో జరుగబోవు గణతంత్ర దినోత్సవ వేడుకల పూర్తి ట్రయిల్ రన్ ను పర్యవేక్షించి, స్టేడియం నందు కట్టు దిట్టమైన భద్రత, పటిష్ట బందోబస్తు ఏర్పాట్లపై, భద్రతా పరంగా ఎటువంటి చిన్న లోపాలు లేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని తగిన భద్రత చర్యలు చేపట్టాలని ఉన్నత అధికారులుకు ఆదేశాలు జారి చేసారు. అనంతరం పోలీస్ పరేడ్ ను, శకటాల ప్రదర్శన మరియు మొత్తం పూర్తి ట్రయిల్ రన్ పర్యవేక్షించి అధికారులకు తగు సూచనలును జారీచేయడం జరిగినది.
ఈ సందర్భంగా *నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు మాట్లాడుతూ*... 26 వ తేదిన స్టేడియం నందు జరుగబోవు గణతంత్ర వేడుకల సందర్భంగా అన్ని శాఖల సమన్వయంతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి గారు, ప్రజా ప్రతినిధులు, న్యాయమూర్తులు, వివిధ శాఖలకు చెందిన రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, స్వాతంత్ర సమరయోధులు పాల్గొంటారు, ఈ నేపధ్యంలో లా & ఆర్డర్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్ మరియు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమమును విజయవంతంగా పూర్తి చేయడానికి పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ మళ్ళింపులు వుంటాయి, ఈ కార్యక్రమమునకు సుమారు 5000 మంది స్కూల్ విద్యార్థులు హాజరవుతారు. వీటికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. లా & ఆర్డర్, ట్రాఫిక్, సెక్యూరిటీ మొదలగు విభాగాల నుండి మొత్తం 1600 మంది పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో ఈ బందోబస్త్ నిర్వహించడం జరుగుతుంది అని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా ఐ.ఎ.ఎస్. గారు, రాష్ట్ర డి.జి.పి. శ్రీ సి.హెచ్.ద్వారకాతిరుమల రావు ఐ.పి.ఎస్.గారు, పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు, డి.ఐ.జి. శ్రీమతి బి.రాజకుమారి ఐ.పి.ఎస్.గారు, జిల్లా కలెక్టర్ శ్రీ జి.లక్ష్మిశా ఐ.ఎ.ఎస్.గారు, పోలీస్ అధికారులు, ఇతర శాఖల అధికారులు, ఏ.డి.సి.పి.లు, ఏ.సి.పి.లు మరియు జిల్లా అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
***