విజయవాడ రూరల్ ప్రాంతం జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో రేషన్ మాఫియా బరితెగింపులు

 బ్రేకింగ్ న్యూస్ 


విజయవాడ రూరల్ ప్రాంతం జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో రేషన్ మాఫియా బరితెగింపులు 





వైయస్సార్ కాలనీ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధి వైయస్సార్ కాలనీ బ్లాక్ నెంబర్ 245 లో రేషన్ డిపో లో నుండి, నెంబర్ ప్లేట్లు లేకుండాఓ వాహనంలో ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని తరలిస్తూ పోలీసులు కి పట్టుపడ్డారు...


 ఈ వాహనం రేషన్ మాఫియా డాన్ విజయరాజు అనే వ్యక్తికి సంబంధించిందని స్థానికులు అంటున్నారు కానీ ఈ వాహనాలు ఎవరివి దీని వెనక ఎవరున్నారు అనేది పోలీసులు దర్యాప్తులో తేలనుంది.


ఒకటో తేదీ నుండి పదో తేదీ వరకు కోట్లాది రూపాయల ప్రభుత్వ రేషన్ బియ్యం అక్రమార్కుల చేతులు మారుతూనే ఉన్నాయి, కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అడ్డుకట్ట వెయ్యలేకపోతున్నారు...


ఇటు ప్రభుత్వాన్ని అటు పోలీసులు కళ్ళు కప్పి రేషన్ మాఫియా రెచ్చిపోతున్నారు 


కొత్తపేట పోలీసులకు తలనొప్పిగా మారనున్న అక్రమ రేషన్ మాఫియా దందా వ్యవహారాలు...


సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న కొత్తపేట పోలీసులు 


దీనిపై మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది