గోగుల రమేష్‌ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్, వంగవీటి రాధా, బొప్పన భవకుమార్‌

 గోగుల రమేష్‌ మృతి పార్టీకి తీరనిలోటు

–గోగుల రమేష్‌ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన  ఎమ్మెల్యే గద్దె రామమోహన్, వంగవీటి రాధా, బొప్పన భవకుమార్‌  



      గోగుల రమేష్‌  ఆకస్మిక మృతి తెలుగుదేశం పార్టీకి తీరనిలోటు అని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అన్నారు.  

  

     తూర్పు నియోజకవర్గ పరిధిలోని  రాణి గారి తోటకు చెందిన  టీడీపీ నాయకుడు గోగుల రమేష్‌ శనివారం మధ్యాహ్నాం ఆకస్మికంగా మృతి చెందారు. 16వ డివిజన్‌ సత్యనారాయణ నగర్‌ రెండో లైన్‌ కళానగర్‌లోని ఆయన ఇంటి దగ్గర ఉన్న రమేష్‌ మృతదేహాన్ని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ ఆదివారం ఉదయం సందర్శించి నివాళులు అర్పించారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా, టీడీపీ నాయకులు బొప్పన భవకుమార్‌తో పాటుగా టీడీపీ నాయకులు గోగుల రమేష్‌ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ తన ప్రగాడ సానుభూతికి తెలియజేశారు. కృష్ణలంక ప్రాంతంలో మంచి నాయకుడిని కోల్పోయామని అన్నారు. రమేష్‌ కుటుంబసభ్యులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు. అనంతరం జరిగిన గోగుల రమేష్‌ అంతిమయాత్రలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌తో పాటుగా పార్టీ నాయకులు, కార్యర్తలు పాల్గొన్నారు.