*జనసేన పార్టీ కార్యాలయంపై గుర్తు తెలియని డ్రోన్ చక్కర్లు*
మంగళగిరి,పెన్ కౌంటర్ న్యూస్ : మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంపై గుర్తుతెలియని డ్రోన్ ఎగరడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈరోజు మధ్యాహ్నం 1:30 నుంచి 1:50 గంటల వరకూ దాదాపు 20 నిమిషాల పాటు డ్రోన్ ఎగిరినట్లు జనసేన నేతలు గుర్తించారు. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందికి పార్టీ నేతలు తెలియజేశారు. దీంతో భద్రతాపరమైన కారణాల దృష్ట్యా డీజీపీ కార్యాలయానికి డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది సమాచారం అందించారు. అలాగే గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సైతం విషయాన్ని తెలియజేశారు.