విజయవాడ
31-01-2025
ప్రచురణార్ధం
*రాష్ట్ర ప్రజలను మరోసారి చంద్రబాబు నాయుడు మోసం చేసాడు - మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు*
*చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు అమలు చేయని వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం మాత్రమే*
*జగన్ మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ పధకాలు అందిస్తామని ఎన్నికల ముందు రాష్ట్రంలో ప్రజలను నమ్మబుచ్చి కూటమి ప్రభుత్వం అధికారం చెప్పట్టింది*
*ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ఆలా చేయలేకపోతే ప్రజలకు తమ కాలర్ పట్టుకునే అవకాశం కూడా కల్పిస్తున్నామని నారా లోకేష్ అన్న మాట వాస్తవమా కాదా ?*
*చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే పులి నోట్ల తలకాయి పెట్టినట్లు ఉంటుందని ప్రజలందరూ ఆలోచించాలని ఎన్నికల ముందే జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలకు విన్నవించుకున్నారు*
*కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలలలో రూ 1.19 లక్షల కోట్ల రూపాయలను అప్పులు తెచ్చారు, కానీ ఎక్కడ ఇచ్చిన ఏ ఒక్క హామీలను నెరవేర్చలేదు*
*వాలంటీర్లకు పది వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి కానీ నేడు అబ్బద్దపు మాటలతో కూటమి ప్రభుత్వం వాలంటీర్ల గొంతు కోసింది*
*జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో రెండున్నర సంవత్సరాలు కోవిడ్ ఉన్న ఎక్కడ కూడా ఏ ఒక్క సంక్షేమ పధకం ఆపలేదు*
*జగన్ మోహన్ రెడ్ట్ గారు ముందు చూపుతో ప్రభుత్వ రంగంలోకి మూడు పెద్ద పోర్టులు, హార్బర్లు నిర్మిస్తుంటే కానీ నేడు కూటమి ప్రభుత్వం వారి యొక్క తాబేదారులకు వాటి పూర్తి బాధ్యతలను అప్పగించే విధంగా ముందుకు వెళ్లడం వాస్తవమా కాదా*
*ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 17 మెడికల్ కాలేజీలు పనులు శంకుస్థాపన చేసి కొన్ని ప్రారంభించి, మరికొన్ని వివిధ దశలలో పనులు జరుగుతూ ఉంటె వాటనట్టిని ప్రయివేటీకరణ చేసే విధంగా వారి యొక్క తాబేదారులకు అప్పజెప్పాలనుకోవడం వాస్తవమా కాదా*
*రాష్ట్రంలో ఉన్న సహజ వనరులు ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, క్వార్జ్ కావచ్చు, ఫ్లై యాష్ కావచ్చు ఇలా ప్రతి ఒక్కటి తెలుగు దేశం పార్టీ నాయకులూ కింద స్థాయి నుంచి పై స్థాయి నాయకుల వరకు దోచుకుంటున్నారు*
*చంద్రబాబు ఎన్నికల ముందు అనేక సార్లు ఈ రాష్ట్రం శ్రీలంక గా మారిపోతుందని అప్పుల ఊబిలో దిగిపోయిందన్న చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని ఎలా అన్నారు*
*ఒకసారేమో 14 లక్షల కోట్లు అప్పు ఉందని శ్వేత పత్రం విడుదల చేసారు, గవర్నర్ గారి ప్రసంగం లో పది లక్షల కోట్లు అప్పు ఉందని చూపించారు. చివరికి నవంబరులో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో సుమారు 6 లక్షల 46 వేల 5 వందల 31 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు ఉందని తేల్చి చెప్పారు.*
*రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలను మోసం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటలు కనపడుతున్నాయి.*
*తొమ్మిది నెలల పాలనలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన పధకం ఎదో చెప్పాలి*
*జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అయితే మనమందరం సుఖంగా సంతోషంగా ఉండేవాళ్ళం, పండగకు అన్నం అన్నా తినుండేవాళ్ళం, ఇప్పుడు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్ని ప్రజలందరూ ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు*
*కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేయాలి, గతంలో జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరికి అందించాలని వైయస్ ఆర్ సిపి తరుపున డిమాండ్ చేస్తున్నాం*
- మాజీ మంత్రి, పశ్చిమ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు
రాష్ట్ర ప్రజలను మరోసారి చంద్రబాబు నాయుడు మోసం చేసారని మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. శుక్రవారం నాడు బ్రాహ్మణ వీధిలోని విజయవాడ పశ్చిమ వైసిపి కార్యాలయంలో ఓ ప్రకటన విడుదల చేసారు ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గాని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం లోగాని చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు అమలు చేయని వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం అన్ని విమర్శించారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారని ఈ రాష్ట్రము లో ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ పధకాలు అందిస్తామని ప్రజలను నమ్మబుచ్చారని. యువగలం పాదయాత్రలోగాని పలు ఛానళ్ల ఇంటర్వ్యూ లో గాని రాష్ట్ర ప్రజలందరికి ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ఆలా చేయలేకపోతే ప్రజలకు తమ కాలర్ పట్టుకునే అవకాశం కూడా కల్పిస్తున్నామని నారా లోకేష్ చెప్పారన్నారు. మీరు ఇచ్చే హామీలు సాధ్యానికి ఇబ్బంది గా ఉండే పరిస్థితి ఉందని మీడియా ప్రతినిధులు నాడు నారా లోకేష్ ని ప్రశ్నిస్తే దానికి మేము అన్ని కూడా లెక్కలు వేసుకొని హామీలు అమలు చేసే విధానంలోనే ముందుకు వెళ్తున్నామని మేము ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాష్ట్ర ప్రజలు తమ చొక్కా కాలర్ పట్టుకునే అవకాశం కూడా కల్పిస్తున్నామని యువ నేత నారా లోకేష్ అన్న మాట వాస్తవమా కాదా అన్ని ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే పులి నోట్ల తలకాయి పెట్టినట్లు ఉంటుందని రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలని గతంలో ఎన్నికల ముందే జగన్ మోహన్ రెడ్డి గారు విన్నవించుకున్నారని, కానీ రాష్ట్ర ప్రజలు కూటమి నాయకుల మాయలో పడి కూటమిని అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలలలో రూ 1.19 లక్షల కోట్ల రూపాయలను అప్పులు తెచ్చారని కానీ ఎక్కడ ఇచ్చిన ఏ ఒక్క హామీలను నెరవేర్చలేదని అన్నారు. అమలు లో ఉన్న వాటిని కూడా పూర్తిగా పక్కదోవ పట్టించారని అన్నారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు పది వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి కానీ నేడు మీరు జిఓ ప్రకారం నియమించబడలేదని మీకు జీతం ఇవ్వలేమని ప్రస్తుతానికి మీరు ఉద్యోగం లో లేరని అబ్బద్దపు మాటలతో కూటమి ప్రభుత్వం వాలంటీర్ల గొంతు కోసిందన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో రెండున్నర సంవత్సరాలు కోవిడ్ ఉన్న ఎక్కడ కూడా ఏ ఒక్క సంక్షేమ పధకం ఆపలేదని ప్రతి ఒక్కటి చెప్పిన మాట ప్రకారం చెప్పిన సమయంలో అమలు చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారని కొనియాడారు. జగన్ మోహన్ రెడ్ట్ గారు ముందు చూపుతో సముద్ర తీరం ఆధారిత ఆర్ధిక వ్యవస్థలకు శ్రీకారం చుట్టి ప్రభుత్వ రంగంలోకి మూడు పెద్ద పోర్టులు, హార్బర్లు నిర్మిస్తుంటే కానీ నేడు కూటమి ప్రభుత్వం వారి యొక్క తాబేదారులకు వాటి పూర్తి బాధ్యతలను అప్పగించే విధంగా ముందుకు వెళ్లడం వాస్తవమా కాదా అన్ని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ? ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 17 మెడికల్ కాలేజీలు పనులు శంకుస్థాపన చేసారని, కొన్ని ప్రారంభించారని, మరికొన్ని వివిధ దశలలో పనులు జరుగుతూ ఉంటె వాటనట్టిని ప్రయివేటీకరణ చేసే విధంగా మా రాష్ట్రానికి మెడికల్ సీట్ లు అక్కర్లేదని కేంద్రానికి కూటమి ప్రభుత్వం లేక రాయడం, వారి యొక్క తాబేదారులకు అప్పజెప్పాలనుకోవడం వాస్తవమా కాదా అన్ని ప్రశ్నించారు? రాష్ట్రంలో ఉన్న సహజ వనరులు ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, క్వార్జ్ కావచ్చు, ఫ్లై యాష్ కావచ్చు ఇలా ప్రతి ఒక్కటి తెలుగు దేశం పార్టీ నాయకులూ కింద స్థాయి నుంచి పై స్థాయి నాయకుల వరకు దోచుకుంటున్నారన్నారు, సహజవనరులు రాష్ట్ర ప్రభుత్వానికి రావలసిన నిధులన్నిటిని వాళ్ళ పార్టీ నాయకులూ తింటుంది వాస్తవమా కాదా అన్ని కూటమి ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు అనేక సార్లు ఈ రాష్ట్రం శ్రీలంక గా మారిపోతుందని అప్పుల ఊబిలో దిగిపోయిందని 2022వ సంవత్సరంలో చెప్పారని దానిని వారి యొక్క పత్రిక ఈనాడు లోకూడా ముద్రించారని అన్నారు. అనేక సార్లు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రం శ్రీలంకకు దెగ్గరలో ఉందని ట్వీట్ చేసారని అన్నారు. ఇవ్వని తెలిసి అప్పటికే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా పని చేసిన చంద్రబాబు ఒక్కసారి రూ 12.50 లక్షల కోట్లు అన్ని ప్రకటించడం వాటన్నిటిని వారి యొక్క పత్రికలలోనే ముద్రించారని అప్పటి కూడా సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని అన్నారని మరొకసారి జులై 2024 లో 14 లక్షల కోట్లు అప్పు ఉందని శ్వేత పత్రం విడుదల చేసారని అలాగే గవర్నర్ గారి ప్రసంగం లో పది లక్షల కోట్లు అప్పు ఉందని చూపించారని అన్నారు. చివరికి నవంబరులో వాళ్లు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో సుమారు 6 లక్షల 46 వేల 5 వందల 31 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు ఉందని తేల్చి చెప్పారని అన్నారు. ఎన్నికల ముందు ఈ రాష్ట్రానికి 14 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు అప్పు ఉందని అన్ని చెప్పిన వాళ్లు ఎన్నికల తరువాత అసెంబ్లీ 6 లక్షల కోట్లు అప్పు ఉందని ప్రకటిస్తే అప్పుడు వాళ్ళు చెప్పిన అప్పులు కంటే ఇప్పుడు ఉన్న అప్పులు తక్కువే కదా మరి ఎందుకు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నారని కూటమి ప్రభుత్వాన్నీ విమర్శించారు. డబ్బులు వస్తున్నాయి గాని సంక్షేమానికి ఇవ్వలేకపోతున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలను మోసం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటలు కనపడుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రజలందరూ అన్ని గమనిస్తున్నారని గతం లో జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కోవిడ్ రెండున్నర సంవత్సరాలున్న అమ్మఒడి, చేయూత, ఫీజ్ రీయంబర్స్మెంట్, పెన్షన్ లు, జగన్ అన్న గోరుముద్ద, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, మత్సకారుల భరోసా నుంచి ఆటో డ్రైవర్లకు సహాయార్ధం నిధి వరకు, చేనేత నేస్తం గాని, ఈబీసీ నేస్తం గాని, కాపులకు కాపు నేస్తం గాని ప్రతి ఒక్క పధకాన్ని అమలు చేస్తే నేడు తొమ్మిది నెలలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన పధకం ఎదో చెప్పాలని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అయితే మనమందరం సుఖంగా సంతోషంగా ఉండేవాళ్ళం, పండగకు అన్నం అన్నా తినుండేవాళ్ళం, ఇప్పుడు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్ని ప్రజలందరూ ఆలోచిస్తున్నారని, బాధపడుతున్నారని తెలిపారు. కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేయాలనీ, గతంలో జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరికి అందించాలని వైయస్ ఆర్ సిపి తరుపున వెలంపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేసారు