కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో టిడిపి లో చేరిన వైసిపి నేతలు
వెస్ట్ లో వైసిపి కి షాక్...
భారీ సంఖ్యలో టిడిపిలో చేరిన వైసిపి నాయకులు, కార్యకర్తలు
విజయవాడ : ప్రజాసంక్షేమం, రాష్ట్రాభివృద్ది కోరుకునే నాయకులు, కార్యకర్తలు మాత్రమే వైసిపి వీడి టిడిపిలోకి వస్తున్నారని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. వెస్ట్ నియోజకవర్గంలో వైసిపి కి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరోసారి షాక్ ఇచ్చారు. టిడిపి 40వ డివిజన్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి హాజరైన ఎంపి కేశినేని శివనాథ్ 54వ డివిజన్ కి చెందిన వైసిపి నాయకుడు రియాజ్ కి టిడిపి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రియాజ్ తో పాటు మరో యాభై మంది వైసిపి కార్యకర్తలు టిడిపి కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు పి.వెంకట చిన్నసుబ్బయ్య, మాజీ ఎమ్మెల్సీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జ్ బుద్దా వెంకన్న, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శులు ఎమ్.ఎస్.బేగ్, బొమ్మసాని సుబ్బారావు, జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షుడు సొలంకి రాజు,తిరుమలేశులతో పాటు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.