దావోస్, ఢిల్లీ ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతంగా ముగించుకోని ఉండ‌వ‌ల్లి లోని త‌న నివాసానికి చేరుకున్న‌ ముఖ్య‌మంత్రి

 చంద్ర‌బాబు కు స్వాగ‌తం ప‌లికిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

ఎంపి, ఎమ్మెల్యేల‌తో సీఎం చంద్ర‌బాబు బేటీ


ఉండ‌వ‌ల్లి :  దావోస్, ఢిల్లీ ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతంగా ముగించుకోని  ఉండ‌వ‌ల్లి లోని త‌న నివాసానికి చేరుకున్న‌ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకి విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ స్వాగ‌తం ప‌లికారు




.దావోస్ పర్యటన ద్విగిజ‌యంగా పూర్తి చేసి, రాష్ట్ర పారిశ్రామిక ప్ర‌గ‌తికి కొత్త బాట‌లు వేసిన  సీఎం చంద్రబాబుకి పుష్పగుచ్చం అందించి ఎంపీ కేశినేని శివనాథ్ అభినందనలు  తెలిపారు. అనంతరం సీఎం చంద్ర‌బాబు నాయుడు త‌న నివాసంలో ఏర్పాటు చేసిన  స‌మావేశంలో ఎంపి కేశినేని శివ‌నాథ్ తో పాటు ప్ర‌భుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య‌,  ఎమ్మెల్యేలు గ‌ద్దె రామ్మోహ‌న్ , శ్రీరాం రాజ‌గోపాల్ (తాత‌య్య‌), తెనాలి శ్రావ‌ణ్ కుమార్, న‌క్కా ఆనంద్ బాబు, భాష్యం ప్ర‌వీణ్, బూర్ల రామాంజేయులు పాల్గొన్నారు.

ఈ స‌మావేశంలో  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు  దావోస్ లో   ప్ర‌ముఖ‌ కంపెనీలతో నిర్వ‌హించిన చ‌ర్చ‌లు, ప‌ర్య‌ట‌న విశేషాలు ఎంపీ, ఎమ్మెల్యేల‌కు  వివ‌రించారు.