బుధవారం సాయంత్రం విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ లో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సురక్ష ప్రారంభం

 ప్రచురణార్థం :-22-1-2025









ధి:22-1-2025 బుధవారం సాయంత్రం విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ లో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సురక్ష ప్రారంభం కార్యక్రమం లో పాల్గొన్న రాష్ట్ర హోం మినిస్టర్ వంగలపూడి అనిత గారు , ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బొండా ఉమా మహేశ్వరరావు గారు ,  ప్రభుత్వ విప్ MLA తంగిరాల సౌమ్య గారు , ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ గారు ,వసంత కృష్ణ ప్రసాద్ గారు , శ్రీరాం రాజగోపాల్ తాతాయ్య గారు , కొలికపూడి శ్రీనివాస రావు గారు, సుజనా చౌదరి గారు , కామినేని శ్రీనివాస్ గారు ,విజయవాడ పోలీస్ కమిషనర్  రాజశేఖర్ బాబు 


ముందుగా సురక్ష  AV ను ప్రారంభించిన ఎమ్మెల్యే సురక్ష కోర్ సి.సి. కెమెరాలు ప్రారంభించిన డి. జి. పి ద్వారక తిరుమలరావు గారు, ఈగల్ వెహికల్స్ ను ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్


 ఈ సందర్భంగా బొండా ఉమా గారు మాట్లాడుతూ :-  విజ‌య‌వాడ లో ఫ్రెండ్లీ పోలీస్ వ్య‌వ‌స్థ‌ను క‌మిష‌న‌ర్ రాజ‌శేఖ‌ర్ బాబు బాగా అమ‌లుచేస్తున్నారు అని, 

వ‌ర‌ద‌ల స‌మ‌యంలో క‌మిష‌న‌ర్ రాజశేఖ‌ర్ ఆధ్వ‌ర్యంలో విజ‌య‌వాడ పోలీసులు ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు అందుకున్నారు, గ‌త పోలీస్ క‌మిష‌న‌ర్ ఏదోక స‌మ‌స్య సృష్టించేవాడు, ఈ క‌మిష‌న‌ర్ ఏ స‌మ‌స్య‌నైనా ప్ర‌జాప్ర‌తినిధుల స‌హ‌కారంతో ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తున్నారు అని...


విజ‌య‌వాడ లో వున్న ఫ్రెండ్లీ పోలీస్ వ్య‌వ‌స్థ రాష్ట్రం మొత్తం వుండాలి, ఎన్టీఆర్ జిల్లా లోని ప్ర‌జాప్ర‌తినిధుల స‌హ‌కారం క‌మిష‌న‌ర్ రాజశేఖ‌ర్ బాబుకి వుంటుంది, ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే  అన్ని పోలీస్ స్టేష‌న్స్  డ్రోన్స్ క‌లిగివున్నాయి అని..


అలాగే విస్తృతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు ద్వారా నేరాల నియంత్రణ సాధ్యమవుతుందన్నారు, కూటమి ప్రభుత్వం నేరాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుదన్నారు పోలీసు శాఖ సమర్ధవంతంగా పనిచేస్తోందన్నారు ప్రజలను రక్షించడంలో డ్రోన్స్, సీసీ కెమెరాల వంటి నూతన టెక్నాలజీ వినియోగం అవసరం అన్నారు సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయటంలో పోలీసులు సేవలను అభినందించి..


రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోతున్నటువంటి గంజాయి మరియు డ్రగ్స్ వినియోగంపై ఉక్కు పాదం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మోపిందని ఇంకా వీటి వినియోగం పూర్తిగా నిషేధించడానికి నగరంలో 1100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, ఎక్కడైతే గంజాయి, రౌడీ మూక ఆగడాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో వీటిని అమరుస్తామని..


 సెంట్రల్ నియోజకవర్గంలో కూడా  స్కూల్స్, కళాశాలల వద్ద  ఎక్కువగా ఏర్పాటు చేసి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యతను తాను తీసుకుంటామని ఈ సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచే కాకుండా స్వచ్ఛంద సంస్థలు కూడా సహకారం చేయడం చాలా సంతోషించదగ్గ అంశమని రాష్ట్రంలోనే కాక నియోజకవర్గంలో కూడా ఇటువంటి భద్రత ఏర్పాట్లు ఇంకా ఎన్నో చేసి ప్రజలకు మంచి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు...


ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.