త‌న తొలి టెస్ట్ మ్యాచ్ లోనే సెంచ‌రీ సాధించి రికార్డ్ క్రియేట్ చేసిన‌ నితీష్ కుమార్‌ రెడ్డి కి

 News nine 24×7updates *16-01-2025*

ఎపిలోని అంత‌ర్జాతీయ క్రీడాకారుల‌ను సీఎం చంద్ర‌బాబు అన్ని విధాలుగా ప్రోత్సాహిస్తారు : ఏసీఏ అధ్య‌క్షుడు,  ఎంపి కేశినేని శివ‌నాథ్ 

ఏసీఏ త‌రుఫున  నితీష్ కుమార్ రెడ్డికి  రూ.25 ల‌క్ష‌ల చెక్కు సీఎం చంద్ర‌బాబు అంద‌జేత‌

త్వ‌ర‌లో ప్ర‌భుత్వం త‌రుఫున ఇంటి స్థ‌లం కేటాయింపు 




అమరావ‌తి :  అంత‌ర్జాతీయ  స్థాయిలో రాణిస్తున్న ఎపి క్రీడాకారుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అండగా వుంటూ.. అన్ని విధాలుగా ప్రోత్స‌హిస్తుంది.అంత‌ర్జాతీయ లో ఆడుతున్న రాష్ట్ర‌ క్రీడాకారులు మ‌రింత‌గా రాణించేందుకు మెరుగైన సౌక‌ర్యాలు  ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు క‌ల్పించ‌నున్నార‌ని ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు , విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ తెలిపారు. 


 విశాఖ‌కు చెందిన టీమ్ ఇండియా క్రికెట్ ప్లేయ‌ర్ కె.నితీష్ కుమార్ రెడ్డి, ఏసీఏ అధ్యక్షుడు విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్, ఏసీఏ కార్య‌ద‌ర్శి రాజ్యస‌భ ఎంపి సానా స‌తీష్ ల‌తో  క‌లిసి

 గురువారం స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ను నాయుడును   పాటుగా  క‌లిశారు.

త‌న తొలి టెస్ట్ మ్యాచ్ లోనే   సెంచ‌రీ సాధించి రికార్డ్ క్రియేట్ చేసిన‌ నితీష్ కుమార్‌ రెడ్డి కి  ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు, ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ప్ర‌క‌టించిన రూ.25 ల‌క్ష‌ల న‌గ‌దు బ‌హుమ‌తిని చెక్కు రూపంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు క్రికెట‌ర్ నితీష్ కుమార్ రెడ్డికి అంద‌జేశారు.



 బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో స‌త్తా చాటిన తెలుగుతేజం  నితీష్ కుమార్‌ రెడ్డి ని  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అభినందించారు.  నితీష్ కుమార్ రెడ్డి తో మాట్లాడి త‌న క్రికెట్ విశేషాలు అడిగి తెలుసుకున్నారు. నితీష్ కుమార్ రెడ్డి భవిష్య‌త్తులో మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని  సీఎం చంద్ర‌బాబు ఆకాంక్షించారు.   ఏసిఏ అధ్యక్షుడు గా ఎంపి కేశినేని శివనాథ్ ప‌ని తీరును సీఎం చంద్ర‌బాబు అభినందించారు. రాష్ట్ర ప్ర‌భ‌త్వం త‌రుఫున క్రికెట‌ర్ కె.నితీష్ కుమార్ రెడ్డికి త్వ‌ర‌లోనే ఇంటి స్థ‌లం కేటాయిస్తామ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు  హామీ ఇచ్చిన‌ట్లు ఎసిఏ అధ్య‌క్షుడు ఎంపి కేశినేని శివ‌నాథ్ తెలిపారు. 


ఈ కార్య‌క్ర‌మంలో ఏసీఏ ఉపాధ్య‌క్షుడు పి.వెంక‌ట రామ ప్ర‌శాంత్,  కోశాధికారి దండ‌మూడి శ్రీనివాస్, ఏసీఏ  కౌన్సిల‌ర్  దంతు గౌరు విష్ణుతేజ్, కె.ముత్యాల‌రెడ్డి  పాల్గొన్నారు.