*పెడనలో దళిత కాలనీ పై సుమారు వందమంది దాడి.*
*కేసులు నమోదు చేయడంలో తాత్సారం చేస్తున్న పోలీసులు.*
*తాళ్ళతో కాళ్ళు చేతులు కట్టేసి నిర్బందించి కొట్టినా ఎలాంటి చర్యలు లేవని దళితుల ఆవేదన.*
*రోడ్డు ప్రక్కన మూత్రవిసర్జన చేస్తేనే గ్రామం పై దాడి చేస్తారా అని ప్రశ్నిస్తున్న కాలని వాసులు.*
కృష్ణాజిల్లా పెడన పట్టణం 10వ వార్డు లోని తెలుగుపాలెం మాలపల్లి గ్రామంపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 15వ తేదీ రాత్రి అనగా కనుమ రోజున దళిత యువకుడు తెలుగుపాలెం టర్నింగ్ వద్ద మూత్రవిసర్జన చేసుకోనుచుండగా స్థానికులు ఘర్షణకు దిగారు. ఈ విషయం అక్కడితో ఆగిపోకుండా పధకం ప్రకారం చుట్టుప్రక్కల గ్రామాల యువకులను పోగుచేసుకుని పెద్దసంఖ్యలో అగ్రకులస్తులు దళిత గ్రామంపై దాడికి దిగారు. మీడియాకు అందిన సమాచారం మేరకు దళిత కాలనిలోకి చొరబడిన వ్యక్తులు ఇంట్లో ఉన్న వ్యక్తిని లాక్కెళ్ళి తాళ్ళతో కాళ్ళు చేతులు కట్టేసి చితకబాదినట్లు తలుస్తుంది.
ఈ విషయమై పెడన పోలీసులకు పిర్యాదు చేయగా ఇప్పటివరకు కేసు నమోదు చేయకుండా కొట్టినవాళ్ళతో రాజీయత్నాలు చేసుకోమని ఉచిత సలహాలు ఇస్తున్నారని బాదితులు ఆరోపిస్తున్నారు.