_రైతుల్ని కూటమి ప్రభుత్వం ఆదుకోవాలి

*_రైతుల్ని కూటమి ప్రభుత్వం ఆదుకోవాలి_*

*_"మిర్చి పంటకి క్వింటాకు కనీసం రూ. 20,000 మద్దతు ధర ఇవ్వాలి"_*

*_"తెగులు సోకిన మిర్చి పంటకు నష్టపరిహారం (క్రాఫ్ ఇన్సూరెన్స్) ఇవ్వాలి_"* 














_ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం_

_ది:-:-25-01-2025/ శనివారం_


జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం మక్కపేట గ్రామంలో 

ఆరుగాలం పండించిన రైతు మిర్చి పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వాలని మరియు తెగులు సోకిన మిర్చి పంటకి నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పంట పొలాలని పరిశీలించిన జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్, నందిగామ మాజీ ఎమ్మెల్యే  మొండితోక జగన్మోహన్ రావు, నియోజకవర్గ ఇన్చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు,వైసీపీ నేతలు._


*జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ కామెంట్స్*


గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మిర్చి పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 49 వేల ఐదు వందల రూపాయలు నష్టపరిహారం అందించింది...



ఈరోజు రైతుల్ని ఈ ప్రభుత్వ  పట్టించుకునే దాఖలాలు లేవు..



ఒకపక్క రైతుకి ఇంతవరకి ఆరు మాసాల అవుతున్న పెట్టుబడి సహాయం అందలేదు..


మరో పక్కన పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు..


మేము కోరేది ఒకటే రైతుల్ని ఆదుకోవాలి పంటకి కనీస గిట్టుబాటు ధర ఇవ్వాలి తెలియచేస్తున్నాం


లేనిపక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున  రైతుల పక్షాన పోరాటం చేస్తామని పేర్కొన్నారు.


*నందిగామ నియోజకవర్గ ఇన్చార్జి మొండితోక జగన్మోహన్ కామెంట్స్*


_మిర్చి పంటకి గిట్టుబాటు ధర లేక రైతుకి వరంగా పెనుభారం అవుతుంది._


_ఎరువులు రేటు, కౌలు రైతులకు కౌలు భారం పెరిగింది_


_రైతుకి అండగా నిలిచిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని తెలిపారు._


_రైతుకు న్యాయం చేయలేని ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని మండిపడ్డారు._


కాబట్టి ఈ ప్రభుత్వం రైతులని తప్పనిసరిగా పట్టించుకోవాలి సరైన గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.



*జాగ్గయ్యపేటనియోజకవర్గ ఇన్చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు కామెంట్స్*


మిర్చి పంటకు క్వింటాకు 20 వేల రూపాయలు మద్దతు ధర మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వం తీసుకోవాలి



ప్రభుత్వం మిర్చి ఎగుమతులు అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలి..


మిర్చి పంటల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి


ఈ జిల్లాలో గతంలో సుమారు 55 వేల ఎకరాల మిర్చి పంట వేశారు ఈ సంవత్సరం  సుమారు 35000 ఎకరాలు మిర్చి పంట వేశారు..


ఆర్ బి కే మరియు పిఎసిఎస్ ద్వారా యూరియా  సరఫరా అయ్యేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, బ్లాక్ మార్కెట్ ని అరికట్టాలి..