ప్రచురణార్థం:-24-1-2025
ధి:24-1-2025 శుక్రవారం ఉదయం 9:30"గం లకు " విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 30 డివిజన్ గద్దె వెంకట్రామయ్య నగర్ 17.49 లక్షల రూపాయల వ్యయంతో స్థానికంగా ఉన్న నూతన వాటర్ ట్యాంకుకు చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణ పనులను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు శంకుస్థాపన చేసి ప్రారంభించడం జరిగినది...
ఈ సందర్భంగా బొండా ఉమా గారు మాట్లాడుతూ:-
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చి దిద్దడానికి ప్రణాళికబద్ధంగా పనిచేస్తున్నట్లు, ఐదేళ్ల వైసిపి ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యానికి గురై పట్టించుకోని ప్రజా సమస్యల పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని...
టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే 130 కోట్ల రూపాయలకు పైగా నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, కొన్ని పనులను ఇప్పటికే పూర్తి చేసినట్లు వివరించారు, నియోజకవర్గంలోని టిడిపి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు...
సెంట్రల్ నియోజకవర్గంలో 130 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టామని ప్రధానంగా డ్రైనేజీలు, రహదారుల నిర్మాణం పై దృష్టి సారించామని అన్నారు 30 డివిజన్ వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న డివిజన్ అని, ఈ డివిజన్లో గత ప్రభుత్వ పాలనలో అభివృద్ధి పనులు సక్రమంగా జరగలేదన్నారు...
గతం లోతాను శాసనసభ్యులుగా అన్న సమయంలో గద్దె వెంకటరామయ్య నగర్ ప్రాంతానికి స్థలాల రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని తీసుకు వచ్చినట్లు రిజిస్ట్రేషన్ సౌకర్యం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో మౌలిక వసతులు ఏర్పడుతున్నాయి అన్నారు, అలాగే రహదారుల నిర్మాణం జరిగిందన్నారు, తరువాత వచ్చిన వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు ముందుకు సాగలేదు అన్నారు...
ఇప్పటికీ అనేక అంతర్గత రోడ్ల నిర్మాణం జరగలేదని చెప్పారు. ప్రస్తుతం రహదారుల నిర్మాణం చేయాలని స్థానికులు కోరుతున్నారని, త్వరలోనే అన్ని రోడ్లను సిసి రోడ్లుగా, బీటీ రోడ్లుగా మారుస్తామని, పార్టీలకతీతంగా నియోజకవర్గం లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని బొండా ఉమ గారు స్పష్టం చేశారు...
ఈ కార్యక్రమంలో:-డివిజన్ నాయకులు గొట్టుముక్కల శాషంరాజు, అధ్యక్షులు చౌదరి సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి L. శ్రీనివాసరాజు, రెడ్డి శంకర్, వేపాడ రమణ, రాంబాబు, సంతోష్, దిల్ ఫీకర్ అలీ, వాసు, మహిళా నాయకులు కోటేశ్వరమ్మ, నాగమణి, అనురాధ, బేబీ సరోజిని, కుమారి తదితరులు పాల్గొన్నారు...