*టీడీపీ కూటమి పాలనలో మత్స్యకారుల సంక్షేమం మళ్లీ మొదలైంది*
*సబ్సిడీపై పడవలు, వేట సామగ్రి*
*వెంకటాచలం మండలం తిక్కవరప్పాడు వద్ద సర్వేపల్లి రిజర్వాయరులో చేపపిల్లలు విడుదల చేసిన సందర్భంగా శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
మీనోత్సవంలో భాగంగా ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన కింద సర్వేపల్లి రిజర్వాయర్ లోకి 5.62 లక్షల చేప పిల్లలను రిజర్వాయరులోకి వదిలాం
చేప పిల్లల కోసం 60 శాతం నిధులు ప్రభుత్వం సమకూరిస్తే, 40 శాతం మత్స్యకార సొసైటీ భరిస్తుంది
అనికేపల్లి, తిక్కవరప్పాడు, సర్వేపల్లితో పాటు 11 గ్రామాలకు చెందిన 500 మంది ఎస్సీ, ఎస్టీ మత్స్యకారులకు చేపల వేట ద్వారా లబ్ధిచేకూరుతుంది
వేట సమయంలో చిన్నపిల్లలను కాకుండా పెద్దచేపలను మాత్రమే పట్టుకోవాలి
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా చేపపిల్లలను వదిలి మత్స్య సంపద వృద్ధి కోసం కృషి చేశాం
గత ఐదేళ్లలో రెండు, మూడు సార్లు మాత్రమే పిల్లలను వదిలారు. అది కూడా సక్రమంగా జరగలేదు
మత్స్యకార సంక్షేమ పథకాలన్నింటిని నిలిపేశారు
మత్స్య శాఖ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలను టీడీపీ కూటమి ప్రభుత్వం తిరిగి అమలు చేస్తోంది
బోట్లు, వలలు, వేట సామగ్రిని సబ్సిడీపై అందజేయనుంది
ఐదు డీప్ సీ ఫిష్షింగ్ బోట్లను సర్వేపల్లి నియోజకవర్గంలో అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది
ఒక్కో బోటు విలువ రూ.1.20 కోట్లు
పురుషులకు అయితే 40 శాతం, మహిళల పేరుతో అయితే 60 శాతం సబ్సిడీతో పడవలు అందజేస్తారు
ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా