నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి :ఎమ్మెల్యే డాక్టర్ పాశిం
నిన్నటి రోజు జరిగిన ఒక కార్యక్రమం లో టీడీపీ సీనియర్ నాయకులు గూడూరు శాసన సభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ వివిధ శాఖలకు మంత్రి గా వ్యవహారిస్తున్న నారా లోకేష్ బాబుని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి వేదిక పై నుండి తన కోరిక ను గట్టిగా తెలియపరిచారు. ఎందుకంటే టీడీపీ అధికారం లోకి రావడానికి " యువగళం"పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తూ, ప్రజలు పడుతున్న కష్టాలను, బాధలను, సమస్యలను కళ్లారా చూసి మన టీడీపీ అధికారం లోకి రాగానే అన్నీ సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తానని, ప్రతీ సామాన్య కార్యకర్తని కూడా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ యువగళం పాదయాత్ర చేసిన మంచి మనసున్న వ్యక్తి నారా లోకేష్ బాబు అని తెలియజేసారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారం లోకి రావడానికి తన శాయశక్తులా అహర్నిశలు కష్టపడి పనిచేసిన వ్యక్తి టీడీపీ లో ఎవరైనా ఉన్నారంటే అది నారా లోకేష్ బాబే అని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ కార్యకర్తలసంక్షేమనిధి,జీవితభీమా 5లక్షలు చేసిన మంచి వ్యక్తి నారా లోకేష్ బాబు అన్నారు. పార్టీ కార్యకర్తల అభ్యున్నతికోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడుతూ ప్రతీ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గం లో ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యలు తీరుస్తున్న వ్యక్తి మన మంత్రి లోకేష్ బాబు అన్నారు. అటువంటి వ్యక్తి ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డిప్యూటీ సీఎం చేయాలని, సూళ్లూరుపేట లో జరుగుతున్న పక్షులపండుగ కార్యక్రమం సందర్బంగా ఏర్పాటు చేసిన వేదికగా,తన కోరిక, కల అని, అలాగే ప్రజల కోరిక అని ఆ కోరిక ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలోనే తీరుస్తారు అని ప్రజలనుద్దేశించి తెలియజేసారు.