అమిత్ షాకు స్వాగతం పలికిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
విజయవాడ : గన్నవరం సమీపంలోని కొండపావులూరులో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎన్ఐడీఎం (NIDM) ప్రాంగణాలను ప్రారంభించేందుకు విచ్చేసిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు మంత్రి నారాలోకేష్ తో కలిసి విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ శనివారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ వచ్చిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు ఎంపి కేశినేని శివనాథ్ పుష్ఫగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఆదివారం ఉదయం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా గన్నవరం సమీపంలోని కొండపావులూరులో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎన్ఐడీఎం (NIDM) భవనాలను ప్రారంభించేందుకు వచ్చారు.