*Press Note From Devineni Avinash -18-01-2025*
*ఎన్టీఆర్ కి సరియైన గుర్తింపు ఇచ్చింది వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి: ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్*
ఆంధ్రుల ఆరాధ్యదైవం, కారణజన్ముడు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు అని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ తెలిపారు. శనివారం నాడు ఎన్టీ.ఆర్ 29వ వర్థంతి సందర్భంగా చుట్టుగుంట డిఆర్ఆర్ కాంప్లెక్స్ వద్ద గల ఆ మహనీయుని విగ్రహానికి అవినాష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చాటిచెప్పిన ఘనత ఎన్టీఆర్ గారిదే అని, రాజకీయ అరంగేట్రం చేసిన అనతికాలంలోనే ముఖ్యమంత్రి పీఠం కైవసం చేసుకోవడమే కాకుండా, ఎందరో యువకులకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన మహామనిషి అని కొనియాడారు. నాడు ఆయనకు వెన్నుపోటు పొడిచి గద్దె దించిన తెలుగుదేశం నాయకులు ఇప్పుడు కేవలం ఎన్నికల సమయాల్లో ఓట్లు కోసం ఆయన పేరు వాడుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఎన్టీ.ఆర్ గారికి సరైన గుర్తింపు ఇచ్చి జిల్లాకు ఆయన పేరు పెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.ఎన్టీఆర్,వైస్సార్ తరువాత సంక్షేమ పాలన చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే అని అన్నారు.కూటమి ప్రభుత్వం ప్రజలకి ఎన్నికల్లో సూపర్ సిక్స్ అని మోసపూరిత హామీలు ఇచ్చి,అధికారంలోకి కి వచ్చాక హామీలన్నీ తుంగలో తొక్కారు..అమ్మ ఒడి, రైతులకు పెట్టుబడి సాయం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్, మహిళలకు 1500 వంటి పథకాలను నీరుగర్చారు అని అన్నారు.తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజలకు ఇచ్చిన హామీలను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే వారిపై కేసులు మోపి జైలుకు పంపిస్తున్నారు..రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు తప్ప ప్రజలకి ఏమి చేసింది ఏమి లేదు.వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పాలన వస్తుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వియ్యపు ఆమర్నద్,ఎన్టీఆర్ జిల్లా వాలంటరీ విభాగం అధ్యక్షులు చందా కిరణ్ తేజ్,డివిజన్ అద్యక్షులు వడ్లమూడి సంపత్,లంకా అబ్బినాయుడు మరియు వైసిపి ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.