మనస్సు శరీరం ఒకటిగా చేసుకుంటూ వాహనం నడపాలి* డిసిపి కృష్ణమూర్తి నాయుడు

 డీటీసీ కార్యాలయం, విజయవాడ తేదీ: 23-01-2024


*మనస్సు శరీరం ఒకటిగా చేసుకుంటూ వాహనం నడపాలి* డిసిపి కృష్ణమూర్తి నాయుడు





*మార్పు రావాలంటే విద్యార్థులతోనే సాధ్యం* డీటీసీ ఎ మోహన్ 


స్థానిక కానూరు లోని వి ఆర్ సిద్ధార్ద ఇంజనీరింగ్ కాలేజీ లో  “లార్జ్ అర్బన్ ఎరియా ట్రాఫిక్ వాలంటీరింగ్ వారోత్సవాల ముగింపు కార్యక్రమంను గురువారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిసిపి కృష్ణమూర్తి నాయుడు, డీటీసీ ఎ మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.


ఈ సందర్భంగా డిసిపి కృష్ణమూర్తి నాయుడు మాట్లాడుతూ వాహనాలను నడిపేటప్పుడు మనస్సు శరీరం ఒకటిగా చేసుకుంటూ  వాహనం నడపడంపై దృష్టి పెట్టాలన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతిఒక్కరు హెల్మెట్ ను కారు నడిపేవారు సీట్ బెల్ట్ ని ధరించే వాహనాలను నడపాలన్నారు. హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించని వాహనదారులపై కేసులు నమోదుచెయ్యడంతో పాటు మోటార్ వాహన చట్టాలపై ప్రజలలో అవగాహన కల్పించడం కూడా ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. 


డీటీసీ ఎ మోహన్ మాట్లాడుతూ రోడ్డు భద్రతపై విద్యార్థి దశలోనే అవగాహన  కల్పించాలని అప్పుడే ట్రాఫిక్ నిబంధనలపై ప్రతి ఒక్కరుకు అవగాహన పెరుగుతుందని ఆయన అన్నారు. కళాశాలలో కూడా రోడ్డు భద్రతపై విద్యార్థుల్లో అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఏదైనా ఒక మార్పు రావాలంటే అది విద్యార్థులతోనే సాధ్యమని రోడ్డు భద్రతపై మీ కుటుంబంలోని వారికి కూడా అవగాహన కల్పించి బయటికి వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని విధంగా చూడాలన్నారు. అప్పుడే ప్రమాదాలను తగ్గించి ప్రమాదరహిత జిల్లాగా మార్పు చెయ్యగలమన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ వాహనాలను నడపాలన్నారు.


ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం జిల్లా యువ అధికారి సుంకర రాము మాట్లాడుతూ రోడ్డు భద్రత వారోత్సవాలు ఈ నెల 17 నుండి 23 వరకు అర్బన్ ఏరియా ట్రాఫిక్ వాలంటరింగ్ ప్రొగ్రాం ను నిర్వహించమన్నారు. వి ఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ యూనిట్ విద్యార్థులు, విజయ ఫార్మసిటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ కాలేజీ ఎన్ఎస్ఎస్ యూనిట్ విద్యార్థులు 500 మంది మై భారత్ వాలంటీర్స్ ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారని ఆయన తెలియజేసారు.


అనంతరం డిసిపి కృష్ణమూర్తి నాయుడు, డీటీసీ ఎ మోహన్ చేతులమీదుగా ఈ కార్యక్రమాలలో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్స్ ను అందజేశారు.

 

ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శివరామ గౌడ్, పెనమలూరు సబ్ ఇన్స్పెక్టర్ లంక సురేష్, ఎన్ఎస్ఎస్ యూనిట్ అధికారి కోళ్ల నరేంద్ర, మై భారత్ వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు