*జంఝావతి సాధనకై బైక్ ర్యాలీ*
*స్వామి వివేకానంద విగ్రహానికి వినతి పత్రం
*ఆయకట్టు రైతుల గ్రామాల్లో సాగిన బైక్ ర్యాలీ*
* బైక్ ర్యాలీకి మద్దతు తెలిపిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం
*ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరిచర్ల మాలతి కృష్ణమూర్తి నాయుడు*
పార్వతీపురం:
జంఝావతి ప్రాజెక్టు పూర్తిస్థాయి సాధనకై బైక్ ర్యాలీ నిర్వహించినట్లు ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరిశర్ల మాలతి కృష్ణమూర్తి నాయుడు అన్నారు. ఆదివారం ఆ సమితి జిల్లా అధ్యక్షులు వంగల దాలి నాయుడు అధ్యక్షతన పార్వతీపురం పట్టణంలోని రాయగడ రోడ్డులో స్వామి వివేకానంద విగ్రహం వద్ద ర్యాలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమం జిల్లా ప్రధాన కార్యదర్శి సిగడం భాస్కరరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాస్కర విద్యాసంస్థల అధినేత చుక్క భాస్కరరావు, సమితి ప్రతినిధులు వర్రి శివకృష్ణ, ఈర్ల సంజీవ నాయుడు, గొర్లి శ్రావణ్ కుమార్, చుక్క చంద్రరావు, అల్లు సత్యం నాయుడు, భారతనంద మహారాజ్ స్వామీజీ, చల్లారపు వెంకట్ నాయుడు, నల్ల బలరాం నాయుడు, నెల్లి లక్ష్మణ్ నాయుడు, మంత్రపూడి వెంకటరమణ, బొమ్మినేని అప్పారావు, గొట్టాపు చిన్నం నాయుడు తదితరులు పాల్గొనగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు, జంజావతి సాధన సమితి కన్వీనర్ ఇవి నాయుడు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా, వివేకానందుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మరిశర్ల మాలతి కృష్ణమూర్తి నాయుడు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ జంఝావతి ఆయకట్టు గ్రామాలైన కృష్ణ పల్లి, లక్ష్మీనారాయణ పురం, చిన బొండపల్లి, పెద బండపల్లి, చొక్కాపు వాని వలస, లచ్చిరాజుపేట, పులిగుమ్మి, మరిపి వలస, నర్సిపురం తదితర గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని రైతులతో మాట్లాడుతూ జంఝావతి పూర్తిస్థాయి ప్రాజెక్టు సాధనకై ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఇటీవల జంఝావతి కన్నీటియాత్ర చేపట్టడం జరిగిందన్నారు. రైతుల నుండి సర్పంచుల నుండి వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖ మంత్రులకు సమర్పించడం జరిగిందన్నారు. మంత్రులు సానుకూలంగా స్పందించాలన్నారు. ఈ బైక్ ర్యాలీతో రైతుల్లో చైతన్యం నింపి జంఝావతి పూర్తిస్థాయి ప్రాజెక్టు సాధించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా కరపత్రాలను పంపిణీ చేశారు. జంజావతి సాధనకై తాము చేపట్టిన క్రతువులు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. జంఝావతి ప్రాజెక్టు పూర్తయి పూర్తిస్థాయి ఆయకట్టు భూములకు సాగునీరు అందిస్తే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఏడాదికి రెండు పంటలు, అపరాలు పండించుకొని రైతు రాజు అవుతాడన్నారు. వలసలు తగ్గుతాయన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రాజెక్టు సాధనకై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ సమితి ప్రతినిధులు సునీల్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.