10-01-2025
ఈ సంక్రాంతికి చంద్రన్న కానుకలు లేవా? లోక్ సత్తా!
రాష్ట్రంలో ఈ సంక్రాంతి పండుగకు తెల్ల రేషన్ కార్డు దారులకు చంద్రన్న కానుకలు ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదా అని లోక్ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర రావు అన్నారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ గత సారి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు సంక్రాంతి పండుగకు చంద్రన్న కానుకలు అని కందిపప్పు, గోధుమ పిండి, సేమియా, బెల్లం, నెయ్యి తదితర నిత్యావసర సరుకులు ఓ సంచిలో పెట్టి ఇచ్చే వారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరలా ఈ పండుగకు కానుకలు ఇస్తారని తెల్ల రేషన్ కార్డు దారులు ఆశగా ఎదురు చూసినా వారికి నిరాశే మిగిలింది.
యథావిధిగా ప్రతి నెల మాదిరీగానే ఈ నెల కూడా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి లాగే బియ్యం, కంది పప్పు, పంచదారతో సరి పెట్టేసారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఈ కానుకలు అయినా ఇచ్చి ఉంటే తెల్ల రేషన్ కార్డు దారులకు కాస్త వెసులు బాటు కలిగేది. రాష్ట్రంలో పరిస్థితి గమనిస్తే క్వార్టర్ మద్యం 99 రూపాయలు, లీటర్ మంచి నూనె 150 రూపాయలు. ప్రతీ కుటుంబానికి మద్యం అవసరమా? లేక మంచి నూనె అవసరమా? ప్రభుత్వం ఒక సారి ఆలోచించాలి. మద్యం ధరలు తగ్గిస్తే కుటుంబంలో ఉన్న మందు బాబులకు మంచిది, అదే నిత్యావసర సరుకుల ధరలు తగ్గస్తే ఆ కుటుంబం అందరికీ మంచిది. మద్యం ధరల తగ్గింపుపై ఉన్న శ్రద్ధ నిత్యావసర సరుకుల ధరల తగ్గింపుపై ప్రభుత్వానికి లేదు అని ఆయన అన్నారు. ఎలాగూ సంక్రాంతి కానుకలు ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి కనీసం రైతు బజారులలో అయినా ఈ నిత్యావసర సరుకులను రాయితీపై ఈ పండగ రోజులలో నైనా ఇస్తే ప్రజలకు మంచి చేసిన వారు అవుతారు. ఆ దిశగా నైనా ప్రభుత్వం ఆలోచన చెయ్యాలని నా మనవి.