మన పశ్చిమ నియోజకవర్గంలో
23-01-2025
ఎపిని అభివృద్ధి పథంలో నడిపించడానికి నిరంతరం శ్రమిస్తున్న నాయకుడు లోకేష్ : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
భవానీపురంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు
విద్యార్ధులకు ఎగ్జామ్ కిట్స్, పుస్తకాలు పంపిణీ
విజయవాడ : యువగళం సమయంలో ఇచ్చిన హామీలు నేరవేర్చుతూ...రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నిరంతరం శ్రమిస్తున్నారని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గం 40 వ డివిజన్ లోని భవానీ పురం బ్యాంక్ సెంటర్ గాంధీ బొమ్మ రోడ్ వద్ద తెలుగు యువత నాయకులు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరాతో కలిసి పాల్గొన్నారు. ఎంపి కేశినేని శివనాథ్ కేక్ కట్ చేసి ప్రజలందరి తరుఫున లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్ధులకు ఎగ్జామ్ కిట్స్ , పుస్తకాలు పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విద్య, ఐటీ శాఖల మంత్రిగా నారా లోకేష్ చూపిస్తున్న చొరవ, సమర్థత రాష్ట్రంలో రాబోయే తరానికి ఒక ఉజ్వల భవిష్యత్తు అందిస్తుందన్నారు. ప్రజాభివృద్దికి గురించి అనుక్షణం ఆలోచిస్తూ నిరంతరం అందుకోసం కష్టపడే లోకేష్ మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు డివిజన్ అధ్యక్షులు వెంకట సుబ్బయ్య, తెలుగు యువత నాయకులు కాండ్రేగుల రవీంద్ర, గుర్రం కొండ, తెలుగు మహిళ నాయకురాలు నసీమాలతోపాటు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.