డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్.

విజయవాడ పాయకాపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్.







రమేష్  న్యూస్ 9, విజయవాడ
సెంట్రల్..
 విజయవాడ పాయకాపురం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని  ప్రారంభించిన విద్యాశాఖ  మంత్రి నారా లోకేష్....

ఈకార్యక్రమానికి :-ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి మంత్రి సత్య కుమార్ యాదవ్, ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు  విజయవాడ పార్లమెంటు సభ్యులు  కేశినేని శివనాథ్  (చిన్ని) గారు,MLA యార్లగడ్డ వెంకట్రావు, కలెక్టర్ లక్ష్మీ శ, మున్సిపల్ కమిషనర్ ధ్యాన చంద్రలు పాల్గొన్నారు..

 ఈ సందర్భంగా విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థ లో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారని,తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించి,ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం మంత్రి నారా లోకేష్ ప్రారంభించడం సంతోషంగా ఉంది అని, ప్రయివేటు విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలను మంత్రి నారా లోకేష్ అభివృద్ధి చేస్తున్నారు అని...

కార్పొరేట్ స్కూల్స్ లో ఉండే మెగా పేరేంటింగ్ కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ఘనత మంత్రి నారా లోకేష్ గారికే సొంతం అని..

ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు అందిపుచ్చుకుంటూ విద్యార్థులు  ఉత్తమ ఫలితాలు సాధించాలి విద్యార్థులు కమ్యూనికేషన్స్ స్కిల్స్ పెంపొందించుకుని, రాష్ట్రంలో ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విద్యార్థులకు ఎటువంటి లోటు లేకుండా వారు కష్టపడి చదివి దేశానికి, రాష్ట్రానికి, తల్లిదండ్రులకు, విద్యాపకులకు మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు.