యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ (ASER) 2024 ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని గ్రామీణ పాఠశాలల్లోని విద్యార్థులలో గణనీయమైన అభ్యాస అంతరాలను వెల్లడించింది,

 రెండు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలారా... మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి...??

విచారణకు సిద్ధం కండి...

మా బిడ్డలకు అక్షరం నేర్పండి...

ఉన్నత విద్య ను అందించండి....


ASER 2024 అధ్యయనం ప్రకారం...



యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ (ASER) 2024 ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని గ్రామీణ పాఠశాలల్లోని విద్యార్థులలో గణనీయమైన అభ్యాస అంతరాలను వెల్లడించింది,

 ఇది  అక్షరాస్యత మరియు సంఖ్యా నైపుణ్యాల జాతీయ ధోరణికి అద్దం పడుతుంది. 


@ఇది అత్యంత ప్రమాదకరమైన పరిణామం..


@ తల్లిదండ్రులుగా ప్రభుత్వాలను రెండు విషయాలను అడుగుతున్నాం...??


₹ మన బిడ్డల విద్య కోసం... ప్రభుత్వాలు ఏటా చేస్తున్న ఖర్చు ఎంత తెలుసా..?


@ ఆంధ్రప్రదేశ్ లో విద్య కోసం

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2023-24లో  పాఠశాల విద్య కోసం ...32,198.39 కోట్లు ...

2024-25 లో పాఠశాల విద్య కోసం


 ...₹29,909 కోట్లు కేటాయించింది.

@ నా తెలంగాణ విషయానికొద్దాం..

2024-25 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ విద్యా బడ్జెట్... ₹21,292 కోట్లు, 

 2023-24లో కేటాయించిన ₹19,093 కోట్లు.


- అక్షరం చదవడం రాయడం నేర్పని .. ఇటు వంటి విద్య కోసం..  వేలకోట్ల...??

ఈ పరిస్థితి కారణము ఎవరు...? అన్ని లెక్కలు తేలాలి..? శ్వేత పత్రం విడుదల చేయాలి...!!


@ మా రెండవ ప్రశ్న (మా ప్రశ్న మీకు బేతాళ ప్రశ్నగా కనిపించవచ్చు) అయినా సమాధానం చెప్పాల్సిందే...!!!


8వ  తరగతి చదివే విద్యార్థు లలో 

- కేవలం 56% మంది మాత్రమే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాల్లో 2వ తరగతి స్థాయి పాఠ్యాంశాలను చదవగలరని అధ్యయనం కనుగొంది. 

@ గణితం విషయానికొస్తే...

-ఆంధ్రప్రదేశ్‌లోని 3వ తరగతి విద్యార్థులలో దాదాపు 40% మంది 99 వరకు సంఖ్యలను గుర్తించగలిగారు

-తెలంగాణ కొంచం మెరుగ్గా ఉంది, 50% మంది విద్యార్థులు ప్రాథమిక సంఖ్య గుర్తింపును ప్రదర్శించారు..


సరే.... పదవ తరగతి పరీక్షలు ఉత్తీర్ణులైనటువంటి గ్రేడ్ల వారి వివరాలు చూద్దాం...


#ఈ క్రింది ఫలితాలు ఎలా సాధ్యమైందో కూడా రెండు రాష్ట్రాల విద్యాశాఖ అధికారులు సమాధానం చెప్పాలి..??



-ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి ఫలితాలు..

ప్రతి 100 మంది విద్యార్థులలో...

2022లో 64.02 శాతం 

2023 లో  72.26  శాతం 

2023-24లో 86.69% శాతం 


-తెలంగాణలో పదవ తరగతి ఫలితాలు 

ప్రతి 100 మంది విద్యార్థులలో

2022 -23 విద్యాసంవత్సరం లో 86.60 శాతం

2023 -24 విద్యా సంవత్సరం లో 91.31 శాతం


ఇదయ్య... మీ లెక్కలు... మీరు సరి చేసుకుంటారా..? మమ్మల్ని సరి చేయమంటారా....? మీరు విచారణకు సిద్ధమా...? మా ప్రశ్నకు జవాబు చెప్పండి..


"అక్షరం ఓ ఆయుధం... ఇదే మా పిల్లల భవిష్యత్ .. భవితవ్యం..".


*ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్* 

        *(రిజిస్టర్ నెంబర్ 6/2022)* 

             *ఆంధ్ర ప్రదేశ్ కమిటీ.*