కృష్ణా జిల్లా
పెనమలూరు
*అమర నేత నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా* విజయవాడ తాడిగడప సెంటర్ నందు పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చేతుల మీదుగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరిగింది.
ఈ సందర్భంగా బోడె ప్రసాద్ మాట్లాడుతూ ఎన్టీ రామారావు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు
ఈ సందర్భంగా బోడె ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి 19 ఈనెల 19వ తారీకు చివరి రోజుగా ప్రకటించారు..
ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఉచిత రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది..
ఈ సందర్భంగా తన వంతు సహాయంగా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కూడా రక్తాన్ని దానం చేయడం జరిగింది
ఆరోగ్య వంతులు,యువకులు రక్తాన్ని దానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడే సదావకాశం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం కార్యాలయం వేదికగా నిలిచింది.