*తిరుపతి జిల్లా సూళ్లూరుపేట*
*తేదీ :-16.01.2025*
*ట్యాగ్ లైన్ :- జిల్లా కలెక్టర్ సూచనల మేరకు 18,19,20 వ తేదీలలో ఫ్లెమింగో ఫెస్టివల్ ఘనంగా నిర్వహిస్తున్నాము*
*శ్రీనివాస్ ప్రసాద్ ప్రోగ్రాం ఆర్గనైజర్, మరియు ప్రాజెక్ట్ డైరెక్టర్ MGNREGF తిరుపతి*
రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక కార్యక్రమాల్లో ప్రజలను ఉత్తేజపరిచేందుకు ఎప్పుడూ ముందుంటుంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గత నాలుగు సంవత్సరాల నుంచి జరగని ఫ్లెమింగో ఫెస్టివల్ ను జిల్లా కలెక్టర్ సూచనల మేరకు 18, 19, 20, తేదీలలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని శ్రీనివాస్ ప్రసాద్ ప్రోగ్రాం ఆర్గనైజర్ తెలిపారు. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ కు సంబంధించి సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు 35 స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ స్టాల్స్ కొన్ని ప్రభుత్వం తరఫున, మరికొన్ని ప్రైవేట్ తరపున నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఫ్లెమింగో ఫెస్టివల్ ను 18వ తేదీ ఉదయం నుంచి మొదలవుతుందని, ఈ ఇనాగరేషన్ ప్రోగ్రామ్ కు విఐపి, వి విఐపి, డిస్టిక్ లెవెల్ ఆఫీసర్ లు వస్తారని తెలిపారు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రతిరోజు ఉదయం 10:00 నుండి సాయంత్రం 5 గంటల వరకు క్రీడల నిర్వహిస్తారని తెలిపారు. నేలపట్టు, అట్టకానితిప్ప నందు పక్షులను వీక్షించడం, బివిపాలెం లో బోట్ షికార్ చేయచ్చు అని తెలిపారు. రాష్ట్ర నలుమూలల ఉన్న ప్రజలు సూళ్లూరుపేట లో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ కు అందరూ ఆహ్వానితులే అని మీడియా ముఖంగా తెలియజేశారు.