సర్వీసులో ఉంటూ మరణించిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల అంత్యక్రియలకు రూ.15వేలు మంజూరు చేసే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది

 సర్వీసులో ఉంటూ మరణించిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల అంత్యక్రియలకు రూ.15వేలు మంజూరు చేసే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర స్త్రీ, పిల్లల, వికలాంగుల & సీనియర్సిటిజన్ల శాఖ కార్యదర్శి సూర్యకుమారి గారు నేడు 28-01-2025న ఉత్తర్వులు జారీచేశారు. మరణించిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు చెందిన చట్టబద్ధమైన వారసులకు ఈ సొమ్మును చెల్లించాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.