*ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ*
*పత్రికా ప్రకటన* *తేది.25-01-2025*
*గంజాయి కేసులలో 12 మంది నిందితులను అరెస్ట్ చేసిన ఎన్.టి.ఆర్.జిల్లా సిటీ టాస్క్ ఫోర్స్ మరియు లా& ఆర్డర్ బృందాలు.*
*నిందితుల వద్ద నుండి సుమారు ఒక లక్షా 40 వేల రూపాయల విలువైన 23 కేజీల గంజాయి స్వాదీనం.*
ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర డి.జి.పి. శ్రీ ద్వారకాతిరుమలరావు ఐ.పి.ఎస్.గారి ఆదేశాల మేరకు ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ పర్యవేక్షణలో పోలీస్ కమీషనరేట్ పరిదిలో సిటి టాస్క్ ఫోర్సు మరియు లా & ఆర్డర్ పోలీసులు గంజాయి రవాణా, విక్రయం, కొనుగోలు, సరఫరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం మరియు గతంలో పలు అక్రమ మాదకద్రవ్యాల కేసులలో అరెస్ట్ కాకుండా తప్పించుకుని తిరుగుతున్న వారిపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ క్రమంలో సిటి టాస్క్ ఫోర్సు మరియు లా& ఆర్డర్ బృందాలకు రాబడిన పక్కా సమాచారం మేరకు నగరంలోని వివిధ ప్రదేశాలలో అనుమానంగా తిరుగుతున్న 12 మందిని అదుపులోనికి తీసుకుని విచారించి వారి వద్ద నుండి సుమారు 23 కేజీల గంజాయిని స్వాదీనం చేసుకుని అరెస్ట్ చేయడం జరిగింది.
*నిందితుల వివరాలు:*
*గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ క్రైమ్.నెం 07/2025 NDPS Act కేసులో*
1. కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామానికి చెందిన పెమ్మాడి మహేష్ @ సమోస (27 సం.) (సస్పెక్ట్ షీట్)
2. కృష్ణా జిల్లా తాడిగాడప గ్రామానికి చెందిన కొమ్మూరు సాయి కిరణ్ (26 సం.) (రౌడీ షీట్)
3. కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామానికి చెందిన తెన్నేరు రోహిత్ కుమార్ (22 సం.)
4. కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామానికి చెందిన కాటూరి మహేష్ (19 సం.)
5. విజయవాడ అయోధ్య నగర్ ఏరియాకు చెందిన వల్లభనేని సాయి శ్రీరామ్ (27 సం.) (సస్పెక్ట్ షీట్)
6. కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామానికి చెందిన బొడ్డు ఉమేష్ (23 సం.) (సస్పెక్ట్ షీట్)
7. విజయవాడ భవానిపురం ఏరియాకు చెందిన షేక్ అక్బర్ బాషా (27 సం.) (సస్పెక్ట్ షీట్)
8. కృష్ణాజిల్లా పెనమలూరు గోసాల కు చెందిన పొలాన కిరణ్ (33 సం.) (సస్పెక్ట్ షీట్)
9. కృష్ణాజిల్లా పెనమలూరు పోరంకికి చెందిన చెందిన ఖగ్గా వెంకట తరుణ్ (25 సం.) (రౌడీ షీట్)
*గుణదల పోలీస్ స్టేషన్ క్రైమ్.నెం 11/2025 NDPS Act కేసులో*
10. విజయవాడ లెనిన్ నగర్ కు చెందిన నాదెళ్ళ తరుణ్ చౌదరి (25 సం.) (సస్పెక్ట్ షీట్)
11. విజయవాడ మురళి నగర్ కు చెందిన షేక్ ఫాతిమా (54 సం.)
* సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ క్రైమ్.నెం 24/2025 NDPS Act కేసులో *
12. విజయవాడ పూర్నానంధపేటకు చెందిన దుంగల మురళి@ పండు (20 సం.)
వీరందరూ వేరు వేరు మార్గాల ద్వారా గంజాయికి అలవాటు పడి, సులభంగా డబ్బులు సంపాదించడానికి గంజాయిని అక్రమంగా కొనుగోలు చేసి వాటిని విజయవాడలోని పలు ప్రాంతాలలోని యువకులకు అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు.
పైన తెలిపిన నిందితులలో 08 మందిపై (షీట్స్ ఉన్న వారిపై) గతంలో గంజాయి కేసులలో అరెస్ట్ కాబడి జైలుకు వెళ్లి వచ్చినవారు. వీరు జైలుకు వెళ్లి వచ్చిన అనంతరం కూడా సులభంగా డబ్బులు సంపాదించాలానే ఉద్దేశంతో ఆంద్రా ఒర్రిస్సా బోర్డర్ పరిదిలోని ఏజెన్సీ గ్రామాలలోని కొందరు గిరిజనుల వద్ద నుండి గంజాయిని తక్కువ డబ్బులకు సేకరించి వాటిని అధిక డబ్బులకు విజయవాడ తదితర ప్రాంతాల వారికి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నలుగురు వ్యక్తులు అయిన పెమ్మాడి మహేష్, కొమ్మూరు సాయి కిరణ్, తెన్నేరు రోహిత్ కుమార్ మరియు కాటూరి మహేష్ లు అల్లూరి సీతారామ రాజు జిల్లా ఏజెన్సీ గ్రామాలలోని కొందరు గిరిజనుల వద్ద నుండి గంజాయిని కొనుగోలు చేసి విజయవాడ తీసుకు వచ్చి వాటిని గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ పరిదిలోని హనుమాన్ పేట సమీపంలోని ఒక పార్క్ వద్ద వీరందరు పంచుకోను సమయంలో టాస్క్ ఫోర్సు మరియు గవర్నర్ పేట పోలీస్ వారు పక్కసమచారంతో 09 మందిని అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుండి 21 కేజీల గంజాయి స్వాదీనం చేసుకోవడం జరిగింది. అదే విధంగా మిగతా రెండు ప్రదేశాలలో ముగ్గురు వ్యక్తులను అదుపులోనికి తీసుకుని సుమారు 02 కేజీల గంజాయి స్వాదీనం చేసుకుని అరెస్ట్ చేయడం జరిగింది.
• ప్రజలందరూ మీ పరిసర ప్రాంతాలలో ఏమైనా గంజాయి సాగు, మత్తుపదార్ధాలను రవాణా, విక్రయించడం మరియు సేవించడం వాటికి సంబంధించిన సమాచారాన్ని ఈ క్రింది తెలిపిన ప్రత్యేక నెంబర్ మరియు Mail.ID ల ద్వారా నార్కోటిక్ సెల్ పోలీస్ వారికి తెలియజేయగలరు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచబడును. *నెంబర్: 9121162475*
• *Mail.ID: antinarcoticcell@vza.appolice.gov.in*
***