దేశంలోనే అతి పెద్ద కటౌట్ సినీ హీరో రామ్ చరణ్ భారీ కటౌట్

 ఎన్టీఆర్ జిల్లా విజయవాడవిజయవాడ న్యూస్ నైన్







దేశంలోనే అతి పెద్ద కటౌట్

సినీ హీరో రామ్ చరణ్ భారీ కటౌట్


విజయవాడ బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో సిద్ధమవుతోంది. సుమారు 250 అడుగుల ఎత్తు ఉండే దీన్ని ఈరోజు సాయంకాలం ఆవిష్కరించనున్నారు. 


ఈ వేడుకకు 'గేమ్ ఛేంజర్' సినిమా బృందంతోపాటు నిర్మాత 'దిల్' రాజు హాజరవుతారని సమాచారం. 


తొలుత కటౌట్ పై హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించనున్నట్లు తెలుస్తోంది. నాలుగు రోజులుగా ఇందుకు సంబంధించిన పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 


ఈ కటౌట్ దేశంలోనే అతి పెద్దది అని అభిమానులు చెబుతున్నారు.