చిలకలూరిపేట నియోజకవర్గంలో మద్యం గ్రామ గ్రామాన, వీధి వీధినా కూడా ఏర్లైపారుతుంది అని వి సి కే పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇంచార్జి వంజా జాన్ ముత్తయ్య అన్నారు, ఈరోజు వారు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో మాట్లాడుతూ, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అక్రమ బెల్ట్ షాపులు పర్మిషన్ లేని బెల్ షాప్ లు ఎత్తివేయమని, వాటి పైన అధికారులు కట్టిన వైఖరి అవలంభించమని చెప్తున్నా కానీ, అధికారులు నమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరించటం శోచనీయమన్నారు,
గ్రామాల్లో మద్యం విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ, రహదారుల వెంబడి, బస్సు షెల్టర్ల వద్ద , స్కూల్స్ దేవాలయాలు అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ సేవించుతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు అని వారు అన్నారు, నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో 3నుండి 7వరకు పర్మిషన్ లేని బిల్ట్ షాపులు ఉన్నట్లు,, వాటిలో కొన్ని సాక్షాత్తు అధికార పార్టీ నాయకుల అండదండతో నడుస్తున్నట్టు మా దృష్టికి వచ్చినట్లుగా తెలిపారు, అధికారులు, ఎక్సైజ్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇప్పటికైనా స్పందించి పర్మిషన్ లేని బెల్ట్ షాపులపై కఠిన వైఖరి అవలంబించాలని, నిర్వాహకులపై చర్యలు తీసుకొని వెంటనే మూసి వేయించాలని వారు డిమాండ్ చేశారు, లేకుంటే గ్రామ గ్రామాన ఉన్న బెల్ షాపుల వివరాలు మేమే బహిర్గతం చేస్తామని, పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లి బెల్ట్ షాప్ ల రద్దుకు పోరాటం చేస్తామని వారు తెలిపారు.