మురికిపూడి ప్రసాద్, నేలం యేసు రాజుకు ఘన సన్మానం.
చిలకలూరిపేట: పట్టణంలోని తెలుగు జర్నలిస్టుల సంఘ ఆధ్వర్యంలో సిపిఎం కార్యాలయంలోని గల ఏలూరి సిద్దయ్య విజ్ఞాన కేంద్ర మందిరంలో ఆదివారం మురికిపూడి ప్రసాదు, నేలం యేసు రాజుకు ఘన సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ సుమారు 15 సంవత్సరాలుగా బాపూజీ వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి, వృద్ధులను, అనాధలను సేవ చేస్తున్నటువంటి మురికిపూడి ప్రసాద్ కు ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన చెందినటువంటి ఆదరణ వెల్ఫేర్ సొసైటీ మదర్ థెరిస్సా జాతీయ సేవా పురస్కారం 2024 అవార్డు అందుకున్నారు.ప్రధాన పత్రిక అయినటువంటి వార్త పేపర్ లో విలేఖరిగా పని చేస్తున్నారు. అదేవిధంగా వినియోగదారుల పరిరక్షణ ఫోరం ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన వంతుగా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రసాద్ కు పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అటువంటి వ్యక్తిని తెలుగు జర్నలిస్టు సంక్షేమ సంఘం తరపున ఘనంగా సన్మానం చేయడం జరిగిందని నాయకులు పేర్కొన్నారు. మండలంలోని మురికిపూడి గ్రామానికి చెందినటువంటి నేలం యేసురాజు అదే గ్రామంలో గ్రానైట్ క్వారీలకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. మురికీడిపూడి గ్రామ లూథరన్ సంఘ ప్యారిస్ డెలిగేట్ మెంబర్ గా నియమితులయ్యారు.పత్రికా రంగంలో ఆయా సమస్యలను వెలికి తీయడంలో తృడమైనటువంటి పాత్ర పోషించిన యేసు రాజు కు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు జర్నలిస్టు సంక్షేమ సంఘం నాయకులు బి.శ్రీను నాయక్, భూపాని వెంకటేశ్వర్లు,కొండ్ర ముట్ల నాగేశ్వరరావు, తుర్లపాటి వెంకట నగేష్, సలికినిడి నాగరాజు, బొంత పృద్వి, ప్రత్తిపాటి చిన్న,పుట్టా వెంకట బుల్లోడు,బి.రాంబాబు నాయక్, కె.రామాంజనేయులు తో పాటు ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.