నూతన పర్యాటక పాలసీను ఆవిష్కరించిన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

 నూతన పర్యాటక పాలసీను ఆవిష్కరించిన  రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ 

న్యూస్ నైన్ విజయవాడ







ఎన్టీఆర్ జిల్లా,విజయవాడ రూరల్ :-ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ద్వారా మంగళవారం విజయవాడలో  స్టేట్ హోల్డర్స్ ఎంగేజ్‌మెంట్ సమావేశం జరిగింది. CII మరియు AP ఛాంబర్స్ ఈ ఈవెంట్‌కు మద్దతు ఇచ్చాయి. హోటల్స్ , అడ్వెంచర్ టూర్ ఆపరేటర్లు , టూర్స్ అండ్ ట్రావెల్స్ , ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీల్లో ఇన్వెస్టర్లు ఈ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఈ సమావేశానికి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ అధ్యక్షత వహించారు. ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ, ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ ఐఏఎస్, ఎండీ ఏపీటీడీసీ ఆమ్రపాలి కాటా ఐఏఎస్, డీసీఈవో ఏపీటీఏ శ్రీనివాస్, ఏపీటీడీసీ ఈడీ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమ ప్రతినిధులుగా సీఐఐ ఏపీ గత చైర్మన్ రామకృష్ణ దాసరి, ఏపీ ఛాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కర్ రావు, ఏపీ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామి నాయుడు, ఏపీ టూరిజం ఫోరం అధ్యక్షుడు కే విజయ్ మోహన్, ఆంధ్రప్రదేశ్ అడ్వెంచర్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ తరుణ్ కాకాని వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సమ్మిట్‌లో మొత్తం 120 మంది నమోదిత పెట్టుబడిదారులు మరియు 80-100 మంది నమోదుకాని సంభావ్య పెట్టుబడిదారులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రతినిధులు మరియు ఇన్వెస్టర్ల మధ్య వ్యక్తిగత సమావేశాలు ఏర్పాటు చేయబడ్డాయి. టూరిజంకు పరిశ్రమ హోదా కల్పించడం పట్ల అందరూ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌కు పర్యాటక రంగంలో మరిన్ని పెట్టుబడులు తీసుకురావడంతోపాటు యువతకు ఉపాధి కల్పిస్తున్నందున ప్రభుత్వానికి, అధికారులకు పర్యాటక పరిశ్రమ తరపున డాక్టర్ తరుణ్ కాకాని కృతజ్ఞతలు తెలిపారు.