సూళ్లూరుపేట మున్సిపాలిటీ లోని బజారు వీధి లో శుక్రవారం MLA నెలవల విజయశ్రీ చేతులు మీదుగా ఎన్టీఆర్ భరోసా పెక్షన్లు పంపిణి

 MLA చేతులు మీదుగా పెంక్షన్లు 

పొట్టి శ్రీరాములుకి ఘన నివాళి








సూళ్లూరుపేట మున్సిపాలిటీ లోని బజారు వీధి లో  శుక్రవారం MLA నెలవల విజయశ్రీ చేతులు మీదుగా ఎన్టీఆర్ భరోసా పెక్షన్లు పంపిణి చేశారు, MLA తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి ఇంటింటికి వెళ్లి నేరుగా లబ్దిదారులకు పెక్షన్లను అందజేయడం జరిగింది ,ఈ సందర్భముగా MLA మాట్లాడుతూ ప్రతి నెల ప్రభుత్వం ఒకటవ తేదీ లబ్ధిదారుల ఇంటికి పెంక్షన్లు అందిస్తూ రాష్ట్రం లో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రమిస్తున్నారని అన్నారు ,

ఈ కార్యక్రమం అనంతరం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని MLA  అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్దకు వెళ్లి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి సమర్పించారు, ఈ కార్యక్రమాలలో టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి,పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ,కార్యదర్శి AG కిషొర్,టీడీపీ నేతలు అలవల శ్రీనివాసులు, బండారు ఆంజనేయులు ,కొమరంజేరి శ్రీధర్ , EV సురేష్, ఆలీ, ఆర్యవైశ్య మహా సభ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాకి శ్రీరామమూర్తి  తదితరులు పాల్గొన్నారు .