*పల్నాడు జిల్లా చిలకలూరిపేట*..
*డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాకతో దద్దరిల్లిన చిలకలూరిపేట*..
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం,మాచవరం మండలం సరస్వతి పవర్ లిమిటెడ్ భూములను పరిశీలించడానికి మంగళగిరి నుండి చిలకలూరిపేట మీదుగా వెళుతుండగా ఎన్నార్టీ సెంటర్ వద్ద పవన్ కళ్యాణ్ కు చిలకలూరిపేట శాసనసభ్యులు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జనసేన పార్టీ సమన్వయకర్త రాజా రమేష్, జనసేన పార్టీ నాయకులు మండలనేనిచరణ్ తేజ, వీర మహిళలు పూలదండలతో, శాలువాలతో,హారతులతో, బాణసంచాలతో ఘనస్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని చూడటానికి జన సైనికులు వీర మహిళలు పవన్ ఫ్యాన్స్, కూటమి నాయకులు కార్యకర్తలు వేలాది మంది తరలివచ్చారు. కాబోయే సీఎం కాబోయే సీఎం అంటూ నినాదాలు చేసిన జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు.