భక్తి భావాన్ని పెంచుతున్న అన్న ప్రసాద కార్యక్రమం

 భక్తి భావాన్ని పెంచుతున్న అన్న ప్రసాద కార్యక్రమం 



  విజయవాడ పశ్చిమ నియోజకవర్గం



ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించడానికి అన్న ప్రసాద కార్యక్రమాలు దోహదం చేస్తాయని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. స్థానిక పశ్చిమ నియోజకవర్గం చిట్టీనగర్ 48వ డివిజన్ సొరంగం రోడ్డులో తొత్తడి రాజు ఆధ్వర్యంలో జరుగుతున్న భవానీ, శివ,అయ్యప్ప స్వామిల అన్నదాన కార్యక్రమం 10వ రోజు శుక్రవారం విజయవంతం గా సాగింది. ఈ మేరకు పలువురు దాతలు ముందుకు వచ్చి కార్యక్రమం విజయవంతం చేస్తున్నారని తొత్తడి రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో నెర్జీ మన్మధరావు, రాళ్లపూడి సాంబ, మాదిరెడ్డి విజయకుమార్, యిల్లిపిల్లి  రవి, వాండ్రాసి శివ, తొత్తడి  రాకేష్, తొత్తడి సాయి తదితరులు పాల్గొన్నారు.