*కృష్ణాజిల్లా,*
*దళితులంటే చిన్న చూపా..?*
*పెనమలూరు పోలీస్ స్టేషన్ ముందు బాధితుడు ఆందోళన..?*
*వివాదాల నిలయం.. నిత్య కళ్యాణం పచ్చ తోరణం.. ఆ స్టేషన్..!*
పెనమలూరు మండలం వణుకూరు గ్రామంలో ఈనెల ఏడో తారీఖున సురేష్ మరియు అతని కుటుంబ సభ్యులు బైక్ పై వస్తున్న సమయంలో అతివేగంగా ట్రాక్టర్ రావడంతో బైక్ అదుపుతప్పి సురేష్ అతని కుటుంబ సభ్యులు కింద పడ్డాడు.
అంత వేగంతో ఎందుకు వస్తున్నావు అని సురేష్ డ్రైవర్ని అడగక నా ట్రాక్టర్ ని అడ్డుకుంటావా అని సురేష్ తో వాగ్వాదానికి దిగాడు.
ట్రాక్టర్ డ్రైవర్ యజమానికి సమాచారం ఇవ్వడంతో ఆవేశంతో, అతని అనుచరులతో అక్కడికి వచ్చిన నాని సురేష్ ను విచక్షణ అరహితంగా కర్రలతో దాడి చేశారు.
అదే రోజు స్టేషన్లో సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు పోలీసులు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోపోవటంతో పెనమలూరు స్టేషన్ ముందు దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి.
సురేష్ మాట్లాడుతూ నాపై దాడి జరిగి 20 రోజులు అయినా పోలీసులు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని పలుమార్లు సిఐ వెంకట రమణ అడిగితే గతంలో నాపై ఉన్న పేట్టి కేసు ఓపెన్ చేసి రౌడీషీట్ కూడా ఓపెన్ చేస్తా అని బెదిరిస్తున్నాడని అన్నాడు.
సిఐ వెంకటరమణ పెత్తందారులకు అమ్ముడుపోయాడని వారికి సపోర్ట్ చేస్తున్నాడని నాపై దాడి చేసిన వారిని కాపాడేందుకు సతవిధాల ప్రయత్నం చేస్తున్నాడని పోలీస్ స్టేషన్ లో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా వీరు స్వయంగా రాసుకున్న పోలీస్ రాజ్యాంగం నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. వారిపై కేసు కట్టి ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చేదాకా ఎక్కడి నుంచి వెళ్లే ప్రసక్తి లేదని సురేష్ అన్నాడు.