గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు

 చిలకలూరిపేటటౌన్, న్యూస్ 9 రిపోర్టర్


- గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి నెలలోజరుగుతున్నాయని, " ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఉపాధ్యాయులు మరియు అధ్యాపకుల ఫోరం " వ్యవస్థాపకులు షేక్.జాఫర్ అన్నారు.  సోమవారం ప్రజా సంఘాల కార్యాలయంలో ప్రైవేటు ఉపాధ్యాయులను ఉద్దేశించి  ఓటు మీద అవగాహన కల్పించారు. ప్రవేట్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు మరియు అధ్యాపకుల ఓట్లు నమోదు వేగవంతం చేయాలని, అలాగే రిటైర్డ్ ఉద్యోగస్తులు,  ప్రైవేటు సంస్థలలో పని చేసే ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేయాలని అన్నారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలలో తొలుత ఓటు నమోదు చేసిన వారికే, ఓటు అడిగే హక్కు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రైవేటు ఉపాధ్యాయులు  చుండి.శివప్రసాద్, షేక్. హసీనా, అంజయ్య, ఆల్ బీన్, లాల్బి, ఆదినారాయణ,  సక్రు నాయక్ తదితర ప్రైవేటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.