ఆర్టీసీ ఈడి గిడుగు వెంకటేశ్వర్లు గారు చిలకలూరిపేట ఆర్టీసీ డిపో లో నెలకొన్న సమస్యలపై ఆకస్మిక పర్యటన కార్యాచరణ రూపొందితేనే విజయవంతం..
మురికిపూడి ప్రసాద్
వినియోగదారుల హక్కుల పరిరక్షణ ఫోరం పల్నాడు జిల్లా ఇన్చార్జ్...
ఆర్టీసీ ఈ డి గిడుగు వెంకటేశ్వర్లు శుక్రవారం ప్రయాణికులు తో కలిసి బస్టాండ్ లో నెలకొన్న కొన్ని సమస్యలను తెలుసుకున్నట్టుగా మీడియాలో రావడం జరిగింది.. అయితే బస్టాండ్ లో కొద్దిపాటి వర్షానికి బస్టాండ్ అంతా కూడా బురద పేరుకుపోయి ప్రయాణికులు కనీసం నడిచేందుకు కూడా వీలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. బస్టాండ్ లో asist వారిచ్చిన వాటర్ ప్లాంట్ అప్పుడప్పుడు మాత్రమే పని చేస్తుందని తెలుస్తుంది.. బస్టాండ్ లో ఆదాయం కోసం విచ్చలవిడిగా పలు మోటార్ సైకిల్ స్టాండ్లు ఇచ్చారు.. ఏ స్టాండ్ లో కూడా డబ్బు చెల్లించే వినియోగదారుడికి న్యాయం జరగదు. కారణం వాళ్లు మోటార్ సైకిల్ స్టాండ్ కు సంబంధించిన ఏనామ్స్ వారు పాటించడం లేదు.. ఇక కార్గోలు చెప్పే పనేలేదు.. పార్సిల్ ఇచ్చిన ,తీసుకున్న పై డబ్బులు ఇవ్వాల్సిందే.. హమాలీలు చెప్పిన కూలి తప్పనిసరిగా ఇవ్వాల్సిందే.
బస్టాండ్ వెనుక వైపు గేటు ఎందుకు ఓపెన్ చేస్తున్నారు.. ఆ గేటు ద్వారా నిరంతరంగా మోటార్ సైకిల్ బస్టాండ్ లోకి వస్తున్నాయి.. బస్సులు రివర్స్ చేసే సమయంలో పలు ప్రమాదాలకు కారణంగా మారింది. కాలం చెల్లిన పల్లె వెలుగు బస్సులతో, ఇటు కార్మికులు అటు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.. కళామందిర్ సెంటర్లో బస్సు ఎక్కాలంటే అక్కడ ఉన్న చిరు వ్యాపారులు. బస్సు వరకు తమ తమ బండ్లను పెట్టి ప్రయాణికులు కనీసం నుంచోవ్వడానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు... ప్రయాణికు నిలబడే వైపు కాకుండా అవతల వైపు షెడ్డు వేశారు ఇది ఎవరికి ఉపయోగం???.
ఒక్క కళామందిర్ సెంటర్ లోనే నాలుగు బస్టాండ్లు దేనికి వసతులు లేవు... ఆర్టీసీ బస్సులు రోడ్డు మీద అడ్డంగా ఆపుతున్నారు.. ఇటువంటి సమస్యలను ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లను చర్యలు శూన్యం..
ఆర్టీసీ ఈడి గిడుగు వెంకటేశ్వర్లు గారు ఆయన పర్యటనలో తెలుసుకొన్న విషయాలు చాలా తక్కువ ఉన్న సమస్యలు చాలా ఎక్కువ కావున వారు తెలుసుకున్న సమస్యలున్న వెంటనే పరిష్కరించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.