దళితులకు సంబంధించిన స్మశాన వాటికను తీసివేసి ఆ వంక పరం పోగు స్థలములో రోడ్లకి మరియు భవనాలకి అనుమతి?

 ** దళితుల పట్ల దురుసుగా ప్రవర్తించిన మండల రెవెన్యూ అధికారి**


- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ముకాస్తున్న మండల రెవెన్యూ అధికారి?

  



 దళితులకు సంబంధించిన స్మశాన వాటికను తీసివేసి ఆ వంక పరం పోగు స్థలములో రోడ్లకి మరియు భవనాలకి అనుమతి?







 అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం అక్టోబర్ 3 

 సుండుపల్లి మండలం కేంద్రానికి కూత వేటు  దూరంలో ఉన్న సర్వే నంబర్ 2067-1 మొత్తం జాక రెండు ఎకరాల 20 సెంట్లు కాగా ఈ యొక్క స్థలాన్ని గుల్ల వాండ్లపల్లి కి చెందిన గ్రామస్తులు ఎప్పటి నుంచో స్మశాన వాటిక వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ఆ స్మశాన వాటిక స్థలములో కొందరు భవనాలు నిర్మించారు. అప్పటికి అధికారులు ఎవరు చొరవ  చూపి పట్టించుకోకపోగా   మిగిలిన గౌరీలు ఉన్న స్థలమును గోరీలను  తొలగించి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తను వెంచర్ కోసం అక్రమంగా స్మశాన వాటిక ఉన్న స్థలంలో  రోడ్లు నిర్మిస్తుంటే గ్రామస్తులు అందరూ వెళ్లి ఎమ్మార్వో గారిని గత మంగళవారం కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది. దీనికి ఎటువంటి స్పందన రాకపోవడంతో మళ్లీ ఈరోజు ఎమ్మార్వో దగ్గరికి వెళ్లి వివరణ అడగగా గ్రామస్తులు మీకు ఎటువంటి న్యాయం జరగదు మీకు దిక్కున చోటికి వెళ్లి చెప్పుకోండి అని దళితుల పట్ల దురుసుగా ప్రవర్తించి గౌరవ ఎమ్మార్వో గారు దళితులని బయటికి నెట్టివేశారు. దీనితో గుల్లవాండ్లపల్లి   గ్రామస్తులు రోడ్డుపైకి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేసి మీడియా సమక్షాన తమకు న్యాయం జరగాలని మా స్మశాన వాటికను మాకు ఇప్పించాలని ఎమ్మార్వో పైన మరియు అక్రమంగా కట్టడాలు నిర్మించిన వారి పైన సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని మీడియా వేదికగా కోరారు.