శ్రీ వాసవి సేవా సంఘ్ ఆధ్వర్యంలో
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా విశేష పూజలు
పట్టణంలోని శ్రీ వాసవి జ్ఞాన మందిరంలో గురువారం శ్రీ వాసవి సేవా సంఘ్ ఆధ్వర్యంలో అమ్మవారి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రం సందర్భంగా విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ్ అధ్యక్షులు కొత్త కోటేశ్వరావుతో పాటు కార్యదర్శి కొప్పురావురి కుమార్, కోశాధికారి గ్రంథి సుబ్బారావు, సహాయ కార్యదర్శి పొట్టి శ్రీనివాసరావు, చిలకల రామ లింగేశ్వర రావు, కొప్పురావూరి నాగేశ్వరావు,పటేల్, ధామిసెట్టి నాగేంద్ర, పసుమర్తి సూర్యం, చెవూరు కృష్ణమూర్తి, కనమర్ల పూడి రమేష్, రాచమల్లు సూర్యారావు, తవ్వ నాగమలేశ్వరరావు, పలువురు ఆర్య వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.