పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు రెవిన్యూ కళ్యాణమండపం లొ విజయనగరం డిఫెన్స్ మరియు పోలీస్ అకాడమీ డైరెక్టర్ డి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో అకాడమీ లో ఉన్న 150 మంది విద్యార్థి విద్యార్థినిలు మరియు ఎన్ వి ఎన్ బ్లడ్ బ్యాంకు వారి సహకారం తో ఉచిత రక్త దాన శిబిరం ఏర్పాటు చేశారు…
ఈ కార్యక్రమానికి ముఖ్య అదితిగా విజయనగరం శాసన సభా సభ్యులు ఐన శ్రీ అదితి గజపతి రాజు గారు విశిష్ట అధితులుగా లోకసత్తా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బిసెట్టి బాబ్జీ గారు
జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి మజ్జి కృష్ణా రావు గారు
పోలీస్ ట్రైనింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీ అప్పారావు గారు
వన్ టౌన్ సీఐ శ్రీ శ్రీనివావాస్ గారు
టీడీపీ నాయకులు శ్రీ అవనాపు విజయ్ గారు పాల్గొన్నారు
అధితులు అందరూ మాట్లాడుతూ విజయనగర డిఫెన్స్ మరియు పోలీస్ అకాడెమీ చేస్తున్న సేవలను కొనియాడారు
అలాగే రక్త దానం యొక్క ఆవశ్యకతను తెలిపారు
విద్యార్థులందరు స్వచ్ఛందంగా శిబిరం లో పాల్గొని 67 యూనిట్స్ బ్లడ్ ని దానం చేశారు
అకాడమీ నుంచి ఆర్మీ ర్యాలీ లో ఉద్యోగం పొందిన 14 మంది విద్యార్థులకి వాళ్ళ తల్లి తండ్రులకు చిరు సత్కారం చేసి వాళ్ళ భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండాలి అనే విషయం మీద అవగాహన కల్పించారు.