*బలమైన విప్లవ విద్యార్థి ఉద్యమ నిర్మాణం కోసం విప్లవ శక్తిని సృష్టించిన పిడిఎస్ యూ*
*1974 అక్టోబర్ నుండి 2024 అక్టోబర్ అర్థ శతాబ్దొస్తవ PDSU సంబరాలు పోస్టల్ ఆవిష్కరణ*
రాజంపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం 50 సంవత్సరాల అర్థ శతాబ్దొస్తవ సభలను జయప్రదం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నేతి నాగేశ్వర మరియు కళాశాల ప్రిన్సిపాల్ పురుషోత్తం ఉపాధ్యాయుల నాగేశ్వర బాబు మరియు సుజాత ఆధ్వర్యంలో పోస్టర్లు ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా నాగేశ్వర మాట్లాడుతూ 1974 అక్టోబర్ 12 తేదీలో పిడిఎస్యు మొదటి మహాసభ హైదరాబాద్ నగరంలో నిర్వహించుకొని సరిగ్గా నేటికీ 50 సంవత్సరాలు అయిన సందర్భంగా సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారని ఈ క్రమంలోనే అక్టోబర్ 24తేదీన హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో దాదాపు 11 రాష్ట్రాలతో కలిసి సభలు నిర్వహించుకుంటుందని తెలియజేశారు.
హైదరాబాద్ నగరంగా ఉస్మానియా యూనివర్సిటీలో 1972 శతకం ఆరంభంలో కామ్రేడ్ జార్జ్ రెడ్డి నేతృత్వంలో పిడిఎస్ గా పురుడు పోసుకున్న విద్యార్థి సంఘం 1974లో పిడిఎస్ యు గా విద్యార్థులలో చిరస్థాయిగా నిలిచిపోయిందని తెలియజేశారు. విద్య ఉపాధి పైనే కాకుండా సామ్రాజ్యవాదం నుండి సామాజిక సమస్యల వరకు పిడిఎస్ యూ చేపట్టిన విప్లవ దృక్పథం తెలుగు నెల పై విద్యార్థి లోకాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిందని భగత్ సింగ్ అల్లూరి ల అంటే జాతీయ విప్లవ వీరుల వారసత్వం గానే సామ్రాజ్యవాద వ్యతిరేకతే నిజమైన దేశభక్తి అని వారన్నారు. పిడిఎస్ ఆవిర్భావం నుండే కులం అంటే కుళ్ళు రా మతం అంటే మత్తు రా కుల మతాల ఎత్తులు దోపిడోల్ల జిత్తులు అనే నినాదంతో నాదముతో అందరికీ ఉచిత విద్య సమాన విద్య ఉపాధి కోసం దశల వారి పోరాటం చేసిందని తెలియజేశారు.
ఈ సందర్భంగా 2014 నుండి నేను ఈ విద్యార్థి సంఘం లో ఉంటూ ఉమ్మడి జిల్లా కడప అన్నమయ్య ప్రాంతాలలోని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పైన ఇంజనీరింగ్ విద్యార్థులకు సకాలంలో స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్ లో ఉన్న విద్యార్థులకు మెస్ చార్జీలు, కాస్మటిక్ చార్జీలు విడుదల చేయాలని అదేవిధంగా ఈ కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాల అధిక ఫీజులు అరికట్టాలని ఎన్నో ఆందోళన కార్యక్రమంలో ధర్నాలు ర్యాలీలు నిర్వహించామని 50 సంవత్సరాల పిడిఎస్యు విద్యార్థి చరిత్రలో 10 సంవత్సరాలు పిడిఎస్ విద్యార్థి సంఘంలో నాలుగు సార్లు జిల్లా అధ్యక్షుడిగా మూడుసార్లు రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం శుభ పరిణామం అని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో PDSU జిల్లా కమిటీ సభ్యులు రామ్ చరణ్ హేమంత్ శ్రావణి వైష్ణవి సుహానా గంగాద్రి భార్గవ్ చంద్ నాని నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.