అన్నమయ్య జిల్లా టి. సుండుపల్లి మండల ఎంపీడీఓ సుధాకర్ రెడ్డి ని ఘనంగా సత్కరించిన

 అన్నమయ్య జిల్లా టి. సుండుపల్లి మండల ఎంపీడీఓ  సుధాకర్ రెడ్డి ని ఘనంగా సత్కరించిన


రాజంపేట అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ గారు

టి.సుండుపల్లి మండలం ఎంపీడీఓ గా బాధ్యతలు చేపట్టిన సుధాకర్ రెడ్డి గారిని ఈ సందర్భంగా రామ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ప్రజాసంక్షేమ గ్రామీణాభివృద్ధి కోసం ప్రతి గ్రామపంచాయతీ లోని మారుమూల గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు అదేవిధంగా ఆంద్రప్రదేశ్ ఎన్డియే కూటమి ప్రభుత్వం ద్వారా గౌరవనియులైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి మరియు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సారధ్యంలో అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందుతాయని కొనియాడుతూ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజమ్మ, బీజేపీ మండల అధ్యక్షులు నాగరాజ,ఉపాధ్యక్షులు వెంకటరమణ నాయుడు, తెలుగుదేశం మండల ఉపాధ్యక్షులు యర్రంరెడ్డి,మైనార్టీ నేత మేకల మహబూబ్ భాష, రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి దామోదర్ నాయుడు, యస్ టి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆనంద్ నాయక్, రాజంపేట పార్లమెంట్ యస్ టి సెల్ ఉపాధ్యక్షులు జయరామ్ నాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ సర్పంచ్ రాము నాయక్, బూతు కన్వీనర్ వెంకటేష్,పలువురు జనసేన తెలుగుదేశం శ్రేణులు ఉమ్మడి పార్టీల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు ఎన్డీయే కూటమి నేతలు స్థానికులు గ్రామప్రజలు పాల్గొన్నారు.