ఖాతాలో పడని పాత బకాయిలు....
స్థానిక యాదవ్ వీధి జంక్షన్ వద్ద నిర్వహించిన పత్రిక మిత్రులు సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థి ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయికిరణ్ యాదవ్ మాట్లాడుతూ గత20 22 విద్యా సంవత్సరం అమ్మ ఒడి తాలూకా డబ్బులు విద్యాసంవత్సరం పూర్తయిపోయి 2023 వచ్చిన ఇప్పటివరకు తల్లుల ఖాతాలో డబ్బులు చేరలేదని దీనివల్ల పాఠశాల యాజమాన్యాలకు ఫీజులు చెల్లించలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారని ఫీజులు చెల్లించని ఎడల యాజమాన్యాలు విద్యార్థుల్ని తిరిగి ఇంటికి పంపించే పరిస్థితి కావున పాత బకాయిల్ని తక్షణమే తల్లిదండ్రుల ఖాతాలో జమ చేయాలని అలాగే 2023-2024 విద్యా సంవత్సరం నూతన కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తల్లికి వందనం పథకం తాలూకా పూర్తి సమాచారం విద్యార్థుల తల్లిదండ్రులకు లేదని అలాగే విద్యా సంవత్సరం చివరికి వస్తున్న కూడా ఎప్పటికీ తల్లికి వందనం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విదమైన చర్యలు లేవని తక్షణమే విద్యార్థుల తల్లిదండ్రుల సమస్యలను పరిష్కరిస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో బొబ్బిలి పట్టణ అధ్యక్షుడు ఎస్ చంద్రశేఖర్ పండు తేజ తదితరులు పాల్గొన్నారు