సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా!

కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులర్  చేయాలని ,సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా! కలెక్టర్ కి  వినతి పత్రం అందజేత!!









అన్నమయ్య జిల్లా రాయచోటిలో కలెక్టరేట్ వద్ద  అవుట్ సోర్స్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి,  ఏ. రామంజులు,  మాట్లాడుతూ,రాష్ట్ర వ్యాపితంగా ప్రభుత్వ శాఖలలో, సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పర్మినెంట్ కై  నేడు దేశవ్యాప్తంగా, రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్ల ఎదుట వేలాదిమంది ఉద్యోగులు,  కార్మికులతో ఆందోళనా కార్యక్రమాలు  జరుగుతున్నాయన్నారు.

టైం స్కేలు, కంటిజెంట్, పార్ట్ టైం, గెస్ట్, పీస్ రేట్, గౌరవ వేతనం తదితర నాన్ రెగ్యులర్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు సౌకర్యాలు అమలు చేయాలని  డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ సొసైటీలు, యూనివర్సిటీలు, స్థానిక సంస్థలు,  మున్సిపాలిటీ, విద్యుత్తు, సర్వ శిక్ష అభియాన్, పకృతి వ్యవసాయం, అగ్రికల్చర్, ఆర్టికల్చర్, గురుకులం, పేకాల్టి లెక్చర్స్ ,నాన్ పర్మినెంట్ కార్మికులు, ఉద్యోగులందరికీ సమా పనికి సమాన వేతనం అమలు చేయాలని, పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. 

2014 జూన్ ముందు నుండి నేషనల్ హెల్త్ మిషన్ ఇతర వైద్య ఆరోగ్య స్కీముల్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు, మెడికల్ సిబ్బందిని వివిధ వైద్య విభాగాల్లో వయోపరిమితి లిచ్చి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు, అదేవిధంగా 108, 104, ఫారెస్ట్,  హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్,  పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి,  తదితర రంగాలలో పనిచేస్తున్న వారికి తక్షణమే హెచ్ఆర్ పాలసీ, సమాన పనికి సమాన వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని,రెగ్యులర్, మినిమం టైం స్కేల్, ఉద్యోగ భద్రత కల్పించాలని, జీతాలు ఒకటవ తారీఖునే వచ్చేటట్టు వార్షిక బడ్జెట్ ను విడుదల చేయాలన్నారు.ఫుల్ టైమ్ స్కేల్ విధానాన్ని హెచ్ఆర్ఏ, డిఏ తో అమలు చేసి వేతనాలు పెంచాలన్నారు. 10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్, గ్రాట్యూటీ కల్పించాలని చెప్పారు. 

సామాజిక భద్రతా పథకాలు, ఈపీఎఫ్ ,ఈఎస్ఐ అమలు చేయాలని కోరారు. పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ మంజూరు, పని భారం తగ్గించేందుకు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి జాబ్ చార్ట్ ఇవ్వాలన్నారు. అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి ఎక్స్ గ్రేషియాను రూ. 20 లక్షలకు పెంచాలన్నారు. మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునేందుకు కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు.ఉద్యోగుల పైన రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరైంది కాదని అన్నారు, కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా కక్షపూరితంగా వ్యవహరించే స్థానిక నాయకుల్ని కట్టడి చేయలని కోరారు.జేఎసి సభ్యులందరూ ఐక్యమత్యంగా ఉండి సమస్యల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.  సమస్యలతో కూడిన  వినతి పత్రం జిల్లా కలెక్టర్ కి అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా  కార్యదర్శి పి శ్రీనివాసులు సంఘీభావం ప్రకటించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి    పంది కాళ్ళమని  పాల్గొని సంఘీభావ ప్రకటించారు. అంగన్వాడి వర్కర్స్  అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భాగ్యమ్మ, ఓబులమ్మ పాల్గొన్నారు. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్  యూనియన్ జిల్లా నాయకులు సుబ్రహ్మణ్యం, నారాయణ  సురేంద్ర,పాల్గొన్నారు, సర్వ శిక్ష అభియాన్  జిల్లా నాయకులు మురళి, ప్రకృతి వ్యవసాయం,  జిల్లా నాయకులు రామానుజులు, గెస్ట్ లెక్చర్స్ జిల్లా నాయకులు, రసూల్, వివో ఏ సంఘ నాయకులు నగరిపాటి ఆనందో, , మున్సిపల్ వర్కర్లు జిల్లా నాయకులు లక్ష్మీదేవి, అంగన్వాడి నాయకురాలు ఖాజాబీ,  తదితరులు కాంట్రాక్ట్ ఔట్ సోర్స్ కార్మికుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు  పాల్గొన్నారు